బాధితుల సమస్యలు పరిష్కరించాలి: ఏఎస్పీ
ABN, Publish Date - May 20 , 2025 | 12:10 AM
:జిల్లాలోని పోలీసుస్టేషన్ల పరిధిలో బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ పి. సౌమ్యలత అధికారులను ఆదేశించారు. సోమవారం విజయనగరంలోని జిల్లా పోలీసుకార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 35 ఫిర్యాదులను స్వీకరించా రు.
విజయనగరం క్రైం,మే19 (ఆంధ్ర జ్యోతి):జిల్లాలోని పోలీసుస్టేషన్ల పరిధిలో బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ పి. సౌమ్యలత అధికారులను ఆదేశించారు. సోమవారం విజయనగరంలోని జిల్లా పోలీసుకార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 35 ఫిర్యాదులను స్వీకరించా రు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐలు లీలారావు, ఆర్‌వీఆర్‌కె చౌదరి, సుధాకర్, ఎస్‌ఐ రాజేష్ పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 12:10 AM