వ్యాన్, బైక్ ఢీ: ఒకరి మృతి
ABN, Publish Date - May 22 , 2025 | 12:24 AM
మండలంలోని రంగాలగూడ వద్ద బుధవారం పౌల్ర్టీ వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందాడు.
పార్వతీపురం రూరల్/బెలగాం, మే 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రంగాలగూడ వద్ద బుధవారం పౌల్ర్టీ వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు, అవుట్ పోస్ట్ పోలీసుల కథనం మేరకు.. ఒడిశాలోని అలమండ పంచాయతీ జగ్గుగూడ గ్రామానికి చెందిన కడ్రక నారు (45) ద్విచక్ర వాహనంపై తన కుటుంబ సభ్యులు కడ్రక అనంత్, కడ్రక అర్జులతో కలిసి పార్వతీపురం మండలంలోని రంగాలగూడలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్నాడు. అదే సమయంలో రంగాలగూడ శివారులోని మలుపు వద్ద ఎదురుగా ఒడిశా నుంచి వస్తున్న పౌల్ర్టీ వ్యాన్ ఢీకొంది. క్షతగాత్రులను 108లో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా కడ్రక నారు మృతిచెందాడు.
Updated Date - May 22 , 2025 | 12:24 AM