జీడిపిక్కల కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి
ABN, Publish Date - Apr 25 , 2025 | 12:11 AM
జీడిపిక్కల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు.
ప్రభుత్వ విప్ జగదీశ్వరి,
పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర
గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): జీడిపిక్కల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు. మం డలంలోని ఇరిడి గ్రామంలో వన్‌ధన్ వికాస కేంద్రం ద్వా రా ఏర్పాటుచేసిన జీడిపిక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆమె గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లా డుతూ దళారుల బారిన పడకుండా ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వయంగా వీడీవీకే సభ్యుల ద్వారా జీడిపిక్కలు కొనుగోలు చేస్తారని చెప్పారు. వీటి మద్దతు ధర కేజీ రూ.157 అని తెలిపారు. వన్‌ధన్ వికాస కేంద్రం ద్వారా లక్ష రూపాయలు విలువ చేసే టెంట్‌హౌస్ సామగ్రిని మహిళా సంఘ సభ్యులకు అం దించామని చెప్పారు. అనంతరం గ్రామ ప్రజలు జగదీశ్వ రికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రామకృష్ణ, జసేన సమన్వయకర్త, ఇరిడి ఎంపీటీసీ కడ్రక మల్లేశ్వరరావు, వీడీవీకే సభ్యుడు ఊరశీ, నియోజకవర్గ ఎస్‌టీ సెల్ ప్రధాన కార్యదర్శి అడ్డాకుల నరేష్, నాయకులు వెంకటరావు, కొండలరావు, బుజ్జేశ్వరరావు, చిన్న లక్ష్మణరా వు, అప్పలస్వామి, సీసీలు, వీవోఏలు, వీడీవీకే సభ్యులు, సచివాలయ సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
డోకిశీలలో..
పార్వతీపురం రూరల్: మండలంలోని డోకిశీల గ్రామంలో గాంధీజీ వన్‌ధన్ వికాస్ కేంద్రంలో ఏర్పాటుచేసిన జీడిపిక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కెట్ యార్డులోనే ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహించేం దుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం గిరిజనులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో టీడీపీ నాయకులు గొట్టాపు వెంకట్‌నాయుడు, బోను చంద్రమౌళి, నీలాపు చంటి, నీలాపు కొండలరావు, వడ్డి చంటి, శ్రీధరపు రాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 12:11 AM