వదలని ఘీంకరింపు
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:19 AM
సీతంపేట ఏజెన్సీలోని గోరపాడు, మోహన కాలనీ, చినబగ్గ, బిల్లమడ, సుందర్యగూడ గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఏనుగుల భయం వెంటాడుతోంది.
గిరిజనులను వెంటాడుతున్న ఏనుగుల భయం
కొండపోడు పనులకు దూరం
సీతంపేట రూరల్, జూలై 9(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలోని గోరపాడు, మోహన కాలనీ, చినబగ్గ, బిల్లమడ, సుందర్యగూడ గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఏనుగుల భయం వెంటాడుతోంది. గడచిన కొద్దిరోజులు గా మన్యంలో సంచరిస్తున్న గజరాజుల భ యంతో గిరిజనులు కొండపోడు వ్యవసాయా నికి దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజులుగా గోరపాడు, మోహనకాలనీ గ్రామాల్లో తిష్టవేసి న ఏనుగులు ఆ ప్రాంతంలోని పంటలను నాశ నం చేస్తున్నాయి. పైనాపిల్, చెట్టుపనస, అరటి, జీలుగు, అ రటి, మామిడి పంటలను ధ్వంసం చేస్తున్నట్టు చినబగ్గ పంచాయతీ సర్పంచ్ బి. నీలయ్య, గిరిజన రైతులు వూయక గురపన్న, మండంగి సోమయ్య, బి.బుడ్డయ్య, బి.నాగేష్ తెలిపారు. ఏనుగుల భయంతో కొద్ది రోజులుగా కొండపైకి వెళ్లలేక పోతున్నామని గిరిజనులు ఆదేదన చెందుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని ఎన్నిసార్లు అట వీ శాఖాధికారులకు విన్నవించుకున్న పట్టించు కోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jul 10 , 2025 | 12:19 AM