ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Unmoving Elephants కదలని గజరాజులు

ABN, Publish Date - Jun 14 , 2025 | 11:47 PM

Unmoving Elephants సీతానగరం మండలాన్ని గజరాజులు వీడడం లేదు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

కోటసీతారాంపురం సమీపంలో సంచరిస్తున్న గజరాజులు

సీతానగరం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): సీతానగరం మండలాన్ని గజరాజులు వీడడం లేదు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా శనివారం అవి ఏకోటివలస - కోటసీతారాంపురం గ్రామాల మధ్య సంచరించాయి. దీంతో ఆ ప్రాంతవాసులు హడలెత్తిపోతు న్నారు. ఏ క్షణాన గజరాజులు గ్రామాల్లోకి వస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. మరోవైపు రైతులు ఖరీఫ్‌ పనుల నిమిత్తం పొలాలకు కూడా వెళ్లలేకపోతున్నారు. తక్షణమే అటవీ శాఖాధికారులు స్పందించి ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించే చర్యలు చేపట్టాలని ఆయా గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:47 PM