Trial is ok ట్రయల్ ఓకే
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:03 AM
Trial is ok
ట్రయల్ ఓకే
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన కలెక్టర్ అంబేడ్కర్, ఎమ్మెల్యే లలితకుమారి
16 బస్సుల్లో విశాఖకు వెళ్లి వచ్చిన అధికారులు
విజయనగరం, జూన్ 19(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర ట్రయల్ రన్ విజయవంతంగా జరిగింది. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో జిల్లా నుంచి 16 బస్సుల్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, లైజన్ అధికారులు ప్రయాణించారు. కలెక్టర్ సాధారణ ఉద్యోగిలా పల్లె వెలుగు బస్సులో అందరితో పాటు ప్రయాణించారు. రహదారి మధ్యలో ఎస్పీ వకుల్‌జిందాల్, ఎస్.కోట ఎమ్మెల్యే లలితకుమారి, జేసీ సేతుమాధవన్, ఏఎస్‌పీ సౌమ్యలత, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, రవాణాశాఖ డీటీసీ మణికుమార్, వేదికల ఇన్‌చార్జి రోణంకి కూర్మనాథ్ తదితరులు బస్సు ఎక్కి వేదిక వరకూ ప్రయాణం చేశారు. ఈ బస్సులు జాతీయ రహదారి మీదుగా ప్రయాణించి మారికవలస నుంచి తిమ్మాపురం బీచ్‌కు చేరుకున్నాయి. బస్సుల రూట్లను, దిగే స్థలాలను, పార్కింగ్ స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా నుంచి బయలుదేరే 660 బస్సుల కోసం తొట్లకొండ ఏపీఐఐసీ హిల్స్, బావికొండలు, ఐటీ హిల్స్ వద్ద పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ప్రతి కంపార్టుమెంటుకు ఒక ఉన్నతాధికారి, పోలీసు బందోబస్తు, ఇన్‌చార్జి అధికారిని నియమించారు. అనంతరం కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ, 21న తెల్లవారుజామున 3 గంటలకే బస్సులు బయలుదేరాలని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
Updated Date - Jun 20 , 2025 | 12:03 AM