ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాస్టర్‌ ట్రైనీలకు యోగాపై శిక్షణ

ABN, Publish Date - May 25 , 2025 | 11:39 PM

యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా మాస్టర్‌ ట్రైనీలకు యోగాపై రెండు రోజు ల శిక్షణా కార్యక్రమం నిర్వహిం చారు.

యోగా చేస్తున్న అధికారులు, సిబ్బంది

పార్వతీపురం, మే 25 (ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా మాస్టర్‌ ట్రైనీలకు యోగాపై రెండు రోజు ల శిక్షణా కార్యక్రమం నిర్వహిం చారు. ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి డా.టి.జగన్మోహ న్‌రావు పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి యోగా గురు రాహుల్‌సింగ్‌చౌహాన్‌ వర్చువల్‌ పద్ధతిలో శిక్షణ ఇచ్చారు. అనంతరం జగన్మోహన్‌ మాట్లాడుతూ యోగా మాసోత్సవాల్లో భాగంగా డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో మాస్టర్‌ ట్రైనీ లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించి నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్‌ నోడల్‌ అధికారి బి.సుశీల, ఎంపీడీవో జి.రమేష్‌, యోగా గురు మోహన్‌, గంత్యాట్‌, రెడ్‌క్రాస్‌ ప్రెసిడెంట్‌ ఎం.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

పాలకొండ: నగర పంచాయతీ కార్యాల యంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో ఆదివారం మొరార్జీ దేశాయ్‌ జాతీయ యోగా సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణా తరగతులను నిర్వహించారు. యోగా గురూజీ జనార్థనమాస్టార్‌, అడ్వకేట్‌ రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 11:39 PM