వ్యాపారులు సహకరించాలి
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:12 AM
ఎస్.కోట పట్టణ పరిధిలోని విశాఖ-అరకు రోడ్డులో వరద నీరు నిల్వకుండా అధికారులు తీసుకోనున్న చర్యలకు ప్రజలు, వ్యాపారులు సహకరించా లని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోరారు.
ఎమ్మెల్యే లలితకుమారి
విశాఖ-అరకు రోడ్డులో వరద నీరు నిల్వకుండా చర్యలు
శృంగవరపుకోట, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఎస్.కోట పట్టణ పరిధిలోని విశాఖ-అరకు రోడ్డులో వరద నీరు నిల్వకుండా అధికారులు తీసుకోనున్న చర్యలకు ప్రజలు, వ్యాపారులు సహకరించా లని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోరారు. మంగళ వారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆమె అధికారులతో కలిసి, విలేకర్లతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఆక్రమణలను తొలగించాలన్నారు. అవసరమగు నిధులు తెచ్చే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఈ సమ స్య పరిష్కారానికి ఈనెల 28న జరిగే సమావేశానికి అధికారులు తాము తీసుకోనున్న చర్యలతో రావాలన్నారు. అనంతరం ఎంపీడీవో ఎం.సతీష్, తహసీల్దార్ శ్రీనివాసరావు, పంచాయతీ ఈవో వీవీ అనురాధ తదితరులతో కలిసి విశాఖ-అరకు రోడ్డులో వరద నీరు నిలుస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. టీడీపీ మండల అధ్యక్షుడు జీఎస్ నాయుడు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, మాజీ వైఎస్ ఎంపీపీ నానిగిరి రమణాజీ, నాయకులు కాపుగంటి వాసు, చెక్కా కిరణ్, వాకాడ బాలు, పెదగాడ అప్పలరాజు, బోనంగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 12:12 AM