ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Totapalli తోటపల్లి పిల్ల కాలువలకు మహర్దశ

ABN, Publish Date - Jun 12 , 2025 | 12:36 AM

Totapalli Minor Canals to Get a New Lease of Life తోటపల్లి పాత బ్యారేజీ పరిధిలోని కుడి, ఎడమ పిల్ల కాలువలకు మహర్దశ పట్టనుంది. వాటి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

పెదబుడ్డిడి లో యంత్రంతో కాలువల అభివృద్ధి పనులు చేస్తున్న దృశ్యం

గరుగుబిల్లి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి పాత బ్యారేజీ పరిధిలోని కుడి, ఎడమ పిల్ల కాలువలకు మహర్దశ పట్టనుంది. వాటి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రావివలస పరిధిలోని ఎడమ కాలువకు సంబంధించి నాగూరు, దత్తివలస, కారివలస, రావివలస, వీరఘట్టం మండలం కంబవలస పరిధిలోని డిస్ట్రిబ్యూటర్ల అభివృద్ధి పనులకు రూ. 8.45 లక్షలు కేటాయించారు. కుడి కాలువకు సంబంఽధించి గదబవలస, కొత్తూరు, సాంబన్నవలస పరిధిలోని అభివృద్ధి పనులకు రూ. 7.08 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు యంత్రాల సహాయంతో సాగునీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. దీనిపై వీరఘట్టం నీటి పారుదలశాఖ జేఈ డీవీ రమణను వివరణ కోరగా..‘ కొద్ది నెలల కిందట ఉపాధి హామీ పథకంలో అంతంత మాత్రంగానే పనులు నిర్వహించారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నాం. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Jun 12 , 2025 | 12:36 AM