తైక్వాండో పోటీల్లో సత్తాచాటారు
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:29 AM
పార్వతీపురం మన్యం జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని, సత్తా చాటిన విద్యార్థులను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందించారు.
పార్వతీపురం రూరల్, జూలై 3 (ఆంధ్రజ్యో తి): పార్వతీపురం మన్యం జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని, సత్తా చాటిన విద్యార్థులను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందించారు. గురువారం నర్సిపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన వారిని సత్కరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో జూన్ 23 నుంచి 25 వరకు జరిగిన జాతీయ తైక్వాండో పోటీల్లో అండర్-25 కిలోల విభాగంలో షణ్ముఖ్ సిద్దార్థనాయుడు బంగారు పతకం సాధించాడు. అండర్-48 కిలోల విభాగంలో బుగత హర్షవర్ధన్ సిల్వర్, అండర్-32 కిలోల మహిళల విభాగంలో ఇజ్జాడ వైష్ణవిదేవి సిల్వర్ మెడల్ సాధించింది. వీరిన ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు అవసరమైన సాయం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
Updated Date - Jul 04 , 2025 | 12:29 AM