భవనం నిర్మించారు.. మరుగుదొడ్లు మరిచారు
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:07 AM
గరుగుబిల్లి పీహెచ్‌సీలో భవన నిర్మాణం పూర్తిచేసినా మరుగుదొడ్ల నిర్మాణం మరిచిపోయారు. దీంతో ఇక్కడికి వైద్యసేవలకోసం వచ్చే రోగులు, ఆసుపత్రిలో విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.
గరుగుబిల్లి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి పీహెచ్‌సీలో భవన నిర్మాణం పూర్తిచేసినా మరుగుదొడ్ల నిర్మాణం మరిచిపోయారు. దీంతో ఇక్కడికి వైద్యసేవలకోసం వచ్చే రోగులు, ఆసుపత్రిలో విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.
గరుగుబిల్లిలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి భవననిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం చర్యలుచేపట్టింది. గతంలో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరడంతో వైసీపీ ప్రభుత్వహయాంలో నాడు-నేడు పథకంలో మరమ్మతు లకు అవసరమైన నిధులు మంజూరయ్యాయి. అయితే పనులు ప్రారం భించిన తర్వాత నిధులు సమస్య తలెత్తడంతో అర్ధాంతరంగా నిలిచిపోయా యి.ఈనేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి రూ. 55 లక్షలు నిధులు కేటాయించింది. ఈ నిధులతో భవన నిర్మాణానికి సంబం ధించి పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. గతంలోఉన్న మరుగుదొడ్లు పూర్తిగా పాడయ్యాయి.ఈనేపథ్యంలో నూతనంగా ఆసుపత్రి అదనపు భవ నాలు నిర్మించినా, అవసరమైన మరుగుదొడ్లకు చర్యలు చేపట్టలేదు. దీంతో ఆరోగ్య కేంద్రంలో మరుగుదొడ్లు సౌకర్యం లేక సిబ్బంది అవస్థలు ఎదు ర్కొంటున్నారు.ప్రస్తుతమున్న ఆరోగ్యకేందరం ఇరుగ్గాఉండడంతో పరీక్షలు నిర్వహణ,మందులు నిల్వలకు సరైన సౌకర్యం లేని పరిస్థితి నెలకొంది. చికి త్స నిర్వహణకు వైద్యులకు సరైనసౌకర్యం లేని దుస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం నూతనంగా భవనం నిర్మించినా సిబ్బందికి అవసరమైన మరుగుదొడ్లు సౌకర్యం కల్పించకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు.
ఆరోగ్యశాఖ అధికారికి వివరించాం
మరుగుదొడ్లుసౌకర్యంలేక అవస్థలు ఎదుర్కొంటున్నామని,వసతి సమస్య కూడా ఉందని వైద్యాధికారి ఎస్.సంతోష్‌కుమార్ తెలిపారు. మరుగుదొ డ్లకు సంబంధించి సెప్టిక్ ట్యాంకు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారికి వివరించినట్లు చెప్పారు. ఆర్‌అండ్‌బీ అధికారులు దృష్టి సారించి మరుగుదొడ్ల నిర్మాణానికి చొరవ చూపాలని కోరారు. గతంలో నిర్మించిన కోవిడ్ భవనాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అప్పగించలేదని, సంబంధిత అధికారులు చొరవ చూపి భవనాన్ని ఆరోగ్య కేంద్రానికి అప్ప గించాలని కోరారు. నాడు-నేడు పథకంలో నిధులు మంజూరైనా అసంపూ ర్తిగా పనులు నిలిచాయని, త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
Updated Date - Jun 08 , 2025 | 12:07 AM