సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి లేదు
ABN, Publish Date - Mar 16 , 2025 | 11:36 PM
విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమ స్యలు పరిష్కరించ డంలో ప్రభుత్వం చిత్తశుద్ధి కనబరచడం లేదని ఏపీటీఎఫ్ ఉమ్మడి జిల్లాల గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయుడు ఆరోపించారు.
రామభద్రపురం, మార్చి 16(ఆంధ్ర జ్యోతి): విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమ స్యలు పరిష్కరించ డంలో ప్రభుత్వం చిత్తశుద్ధి కనబరచడం లేదని ఏపీటీఎఫ్ ఉమ్మడి జిల్లాల గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయుడు ఆరోపించారు. ఆదివారం మిర్తివలసలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఉపాధ్యా యుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. పాత బకాయిలు చెల్లించడం లేదని, డీఏలు ఇవ్వలేదని, పీఆర్‌సీ ఏర్పా టుచేయలేదన్నారు.ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ప్రకటనలు ఇస్తోందే తప్పా,ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. విద్యాప్రమాణాల పెంపుదల ముసుగులో విద్యను ప్రైవే టీకరణ చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనబడుతోందని ఆరోపించారు. మన్యం జిల్లా కార్యదర్శి మీసాల వెంకట గౌరీశంకర్ మాట్లాడుతూ పాఠశాలల్లో రెండు మీడియాలను కొనసాగించాల ని కోరారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్.జగదీశ్వరరావు మాట్లాడుతూ 117 జీవోరద్దుచేయాలని డిమాండ్‌చేశారు.
Updated Date - Mar 16 , 2025 | 11:36 PM