జిల్లాలో ఎరువుల కొరత లేదు
ABN, Publish Date - Jul 28 , 2025 | 12:16 AM
జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జిల్లాలో ఎరువుల పంపిణీ పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. రైతు సేవా కేంద్రాల్లో ఎరువుల లభ్యత, పంపిణీ తీరు విధానాన్ని పరిశీలిస్తున్నాం. రైతులు యూరియాను అధిక మొత్తంలో వాడరాదు. ఎరువులను సముచితంగా ఉపయోగించుకోవాలి. ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జూలై చివరి నాటికి జిల్లాలో దాదాపు 11,327 టన్నుల యూరియా అవసరం అవుతుంది. ఇప్పటివరకు 12,544 టన్నులు జిల్లాకు సరఫరా అయ్యింది. ఇప్పటివరకు 9,557 టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశాం. ఇటీవల 600 టన్నుల యూరియా జిల్లాకు చేరింది. ప్రైవేటు డీలర్ల వద్ద 966 టన్నులు, సొసైటీలు, రైతు సేవా కేంద్రాల వద్ద 1800 టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 120 టన్నుల యూరియా నిల్వలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. డీఏపీ, పొటాష్, సూపర్‌ఫాస్పేట్, కాంప్లెక్స్ ఎరువులు కూడా సమృద్ధిగా జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 245 రైతు సేవా కేంద్రాల ద్వారా 7,235 టన్నులు, 22 సొసైటీల ద్వారా 1,369 టన్నుల యూరియా, డీఏపీని రైతులకు పంపిణీ చేశాం. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్‌కు (7989434766) ఫోన్ చేయవచ్చు.’ అని కలెక్టర్ తెలిపారు.
Updated Date - Jul 28 , 2025 | 12:16 AM