ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాగెమ్మపేటలో చోరీ

ABN, Publish Date - Jul 25 , 2025 | 11:58 PM

బాగెమ్మపేట గ్రామంలోని ఓ ఇంట్లో గు రువారం రాత్రి చోరీ జరిగింది.

వంగర, జూలై 25 (ఆంధ్రజ్యోతి): బాగెమ్మపేట గ్రామంలోని ఓ ఇంట్లో గు రువారం రాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనపై ఎస్‌ఐ షేక్‌శంకర్‌ శుక్రవారం తెలి పిన వివరాలు ఇలా ఉన్నాయి. బాగెమ్మపేటకు చెందిన శంకరరావు వారం రోజు ల కిందట తన చిన్నకుమారుడు ఇంటికి హైదరాబాద్‌ వెళ్లారు. అయితే శుక్రవా రం ఉదయం ఆ ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని ఎదురింటిలో నివాసం ఉంటున్నవారు గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. గురువారం రాత్రి చోరీ జరిగినట్టు గ్రహించి, శంకరరావుకు సమాచారం అందించారు. దీంతో శంకరరావు తమ్ముడు కృష్ణారావు తోపాటు పలువురు అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువాలో బంగారం, వెండి వస్తువులు కనిపించలేదు. బీరువాలోని 20 తులాల బంగారం, కొన్ని వెండి వస్తువులు అపహరణకు గురైనట్టు గుర్తిం చి పోలీసులకు తెలిపారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం విజయన గరం క్లూస్‌ టీంకు సమాచారం అందించారు. దీంతో విజయనగరం క్లూస్‌టీం ఎస్‌ఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, వేలిముద్రలు సేకరించారు. శంకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 25 , 2025 | 11:58 PM