కార్యదర్శులకు పనిభారం తగ్గించాలి
ABN, Publish Date - Jul 01 , 2025 | 12:07 AM
పంచాయతీల పరిధిలో విధులు నిర్వహిస్తు న్న కార్యదర్శులకు పనిభారం తగ్గించాలని మండల పంచాయతీ కార్యదర్శుల సంఘ ప్రతినిధులు కోరారు.
గరుగుబిల్లి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల పరిధిలో విధులు నిర్వహిస్తు న్న కార్యదర్శులకు పనిభారం తగ్గించాలని మండల పంచాయతీ కార్యదర్శుల సంఘ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవా రం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో ఎన్.అర్జునరావు, డిప్యూ టీ ఎంపీడీవో ఎల్.గోపాలరావులకు వినతిప త్రం అందించారు. ఈసందర్భంగా వీరు మా ట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి పారిశుఽ ద్య నిర్వహణ పనులకు హాజరు కావడం కష్టతరంగా ఉందని, వారంలో రెండు రోజులు పాటు ఈ విధుల నిర్వహణకు వెసులబాటు కల్పించాల ని కోరారు. చెత్త సేకరణపై ఐవీఆర్‌ఎస్ కాల్స్ ఆధారంగా కార్యదర్శు ల పనితీరును బేరీజు వేస్తున్నారు. దీనిని ఉప సంహరించాలన్నారు. ఇలా అనేక సమస్యలతో సతమతం అవుతున్నామని, తమ డిమాండ్ల సాధనకు ఈనెల 4న నల్ల బ్యాడ్జీలతో నిరసన చేయనున్నట్టు వారు తెలిపారు. నిరసలకు స్పందించకుంటే 9న పెన్‌డౌన్ నిర్వహిస్తామని, సకాలంలో స్పందించకుంటే 15వ తేదీ నుంచి శాంతి యుత నిరసనలు చేపడతామని తెలిపారు.
Updated Date - Jul 01 , 2025 | 12:07 AM