ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమితోనే రాష్ట్ర సంక్షేమం

ABN, Publish Date - Jul 16 , 2025 | 12:02 AM

కూటమి పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యేలు తెలిపారు.

కూటమి పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యేలు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వారు పాల్గొని, పథకాలపై వివరించారు.

భోగాపురం, జూలై 15(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు అన్నారు. ముంజేరు గ్రామం లో మంగళవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించారు. రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.శ్రీనివాసరెడ్డి. ఎంపీటీసీ పిడుగు సత్యం, పిడుగు తోటారావు తదితరులు పాల్గొన్నారు.

రాజాం: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. మంగళవారం పొగిరి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రభుత్వ పథకాలను వివరించారు. నాయకులు పాల్గొన్నారు.

విజయనగరం రూరల్‌: ఏడాదిలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, రానున్న నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. నగరం లోని 48, 49, 50 డివిజన్‌లోనూ, మండల పరిధిలోని ద్వారపూడిలోనూ మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నగర అధ్యక్షుడు ప్రసాదుల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

గుర్ల: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కమిడి కళావెంకటరావు అన్నారు. రాగోలు గ్రామంలో సుపరిపా లనలో తొలి అడు గు కార్యక్రమంలో ఆయన మంగళవా రం పాల్గొన్నారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా గొడు గులు వేసుకొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనం తరం సీసీ రోడ్డును ప్రారంభించారు. టీడీపీ నాయకులు వెన్నె సన్యాసినాయుడు, తిరుమలరాజు కిరణ్‌కుమార్‌, మండల అప్పలనాయుడు, దాసరి శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

శృంగవరపుకోట రూరల్‌: రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నిస్వార్థమైన పాలన చేస్తున్నారని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సీతారాంపురంలో టీడీపీ నాయకుడు డోకుల అచ్చెంనా యుడు ఆధ్వర్యంలో మంగళవారం సుపరిపా లనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - Jul 16 , 2025 | 12:03 AM