ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

The trouble with those three ఆ మూడింటితో అవస్థలే

ABN, Publish Date - Jul 15 , 2025 | 11:46 PM

The trouble with those three శృంగవరపుకోట పట్టణ మధ్యలో ఉన్న కళింగెడ్డ (జగ్గుచెరువు సాగునీటి కాలువ) పూర్తిగా మురుగుతో నిండిపోయింది. పొదలు, చెత్తా, చెదారం, ప్లాస్టిక్‌, గాజు వస్తువులతో దోమలకు ఆవాసమైంది. ఇరువైపులా ఉన్న నివాసాలకు నిత్య నిరకం చూపిస్తోంది. చిన్నపాటి చినకులు పడినా ఇందులోని మురుగంతా ఇళ్లల్లోకి వచ్చేయడంతో వర్షకాలమంటేనే స్థానికులు వణుకుతున్నారు. సాగునీటికి బదులు రోగాలను మోసుకొస్తోంది.

ఎస్‌.కోట పట్టణం మధ్య నుంచి వెళ్లే కళింగెడ్డ (జగ్గుచెరువు సాగునీటి కాలువ)

ఆ మూడింటితో అవస్థలే

మురుగుమయమైన కళింగెడ్డ

దుర్గంధం వెదజల్లుతున్న కుళ్లీకోనేరు

వరదతో నిండిపోతున్న విశాఖ-అరకు రోడ్డు

స్వచ్ఛాంధ్ర సాకారానికి దూరంగా ఎస్‌.కోట

శృంగవరపుకోట, జూలై 15(ఆంధ్రజ్యోతి):

శృంగవరపుకోట పట్టణ మధ్యలో ఉన్న కళింగెడ్డ (జగ్గుచెరువు సాగునీటి కాలువ) పూర్తిగా మురుగుతో నిండిపోయింది. పొదలు, చెత్తా, చెదారం, ప్లాస్టిక్‌, గాజు వస్తువులతో దోమలకు ఆవాసమైంది. ఇరువైపులా ఉన్న నివాసాలకు నిత్య నిరకం చూపిస్తోంది. చిన్నపాటి చినకులు పడినా ఇందులోని మురుగంతా ఇళ్లల్లోకి వచ్చేయడంతో వర్షకాలమంటేనే స్థానికులు వణుకుతున్నారు. సాగునీటికి బదులు రోగాలను మోసుకొస్తోంది. కుళ్లీకోనేరుదీ ఇదే దుస్థితి. వ్యవసాయ భూములకు సాగునీరు అందించే బంద మురికికుపంగా మారడంతో కుళ్లీకోనేరుగా పేరొందింది. ఇక విశాఖ-అరకు ప్రధాన రహదారిదీ ఇదే పరిస్థితి. వానొస్తే ఈ రోడ్డులో ప్రయాణం అవస్థే. వరద నీరు అధికంగా నిల్వ ఉండిపోతుంది. ఈ ముడు శృంగవరపుకోట పట్టణ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాకారానికి అడ్డంకిగా మారాయి. అరకు పర్యాటక ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న ఈ పల్లె పట్టణం జిల్లాలోని మేజర్‌ పంచాయతీల్లో పెద్దది కాగా అపరిశుభ్రతలో అట్టడుగున చేరుతోంది.

మూడు దశాబ్దాలుగా పెడదారి

70 ఏళ్ల క్రితం నుంచి నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఎస్‌.కోట పట్టణంలో మూడు దశాబ్దాల నుంచి సమస్యలు పీడిస్తున్నాయి. ఇక్కడ నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు, ఇక్కడ పనిచేసిన అధికారులు, ఇదే దారిలో అరకు పర్యాటక ప్రాంతానికి వెళ్తున్న ప్రముఖులెవరూ ఎస్‌.కోటను సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు వందలాది ఎకరాలకు సాగునీరు అందించే కళింగెడ్డ పట్టణ పైభాగాన వున్న జగ్గుచెరువు నుంచి 15 అడుగుల పైబడిన వెడల్పుతో పట్టణం మధ్య నుంచి వెళ్తుంది. ఈ కాలువ దాదాపు 400 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు మరిన్ని చెరువులకు అనుసంధానంగా ఉండేది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ గెడ్డ కాలువకు ఇరువైపుల ఉన్న నివాసితులు వాడుక నీరు, చెత్త, మరుగుదొడ్ల అవుట్‌లెట్‌లను నేరుగా వదిలేశారు. అనేక రకాల వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇప్పుడు చూసిన వారెవరైనా మురుగు కాలువనుకుంటున్నారు. పదేళ్ల కిందట ఈ కాలువ శుద్ధి కోసం రూ.2.30 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అంచనా వేయగా విషయాన్ని అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యేగా ఉన్న కోళ్ల లలితకుమారి వివరించారు. నిధులు మంజూరైనప్పటికీ అవి చాలవని కాంట్రాక్టర్‌ పని మొదలు పెట్టలేదు. అంతలో ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారిపోవడంతో సమస్య అలాగే ఉండిపోయింది.

- సాయిబాబా ఆలయం వద్ద ఉన్న కుళ్లీకోనేరు ఒకప్పుడు 150 ఎకరాలకు సాగునీరి అందించేది. ఇప్పుడది మురుగుతో నిండి ఉంది. దీనికి ఆనుకొని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాటశాల, బీసీ వసతి గృహం ఉన్నాయి. ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోమ్‌, పలు నివాసాలున్నాయి.. పట్టణంలో పెద్ద కాలనీగా గుర్తింపు పొందిన శ్రీనివాస కాలనీలోని వాడక నీరుంతా ఇందులోనే కలుస్తోంది. కోనేరు సమీపంలో ఉన్న వారంతా అక్కడి దుర్ఘంధానికి నరకయాతన పడుతున్నారు.

- విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని ఉన్న పలు వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానులు వరద నీరు పారే కాలువను ఆక్రమించారు. దీంతో నీరు పోయేందుకు మార్గాలు మూసుకుపోయాయి. వర్షం పడినప్పుడల్లా విశాఖ-అరకు రోడ్డుపైకి వరద నీరు వచ్చేస్తోంది. ఈ మూడు సమస్యలకు పరిష్కారం దొరికితే తప్ప ఎస్‌.కోటలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రకు చోటుండదు.

Updated Date - Jul 15 , 2025 | 11:46 PM