ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ ఆలయానికి 700 ఏళ్ల చరిత్ర

ABN, Publish Date - May 06 , 2025 | 11:14 PM

మండలంలోని కొవ్వాడ అగ్రహారం పంచాయతీలో ఉన్న శివాలయానికి 700 ఏళ్ల చరిత్ర ఉందని పురావస్తుశాఖ అధికారులు స్పష్టం చేశారు.

గ్రామస్థులతో కలిసి శివలింగాన్ని పరిశీలిస్తున్న పురావస్తుశాఖ అధికారి ఫల్గుణరావు

- కొవ్వాడ అగ్రహారంలోని శివాలయాన్ని పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు

పూసపాటిరేగ, మే 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొవ్వాడ అగ్రహారం పంచాయతీలో ఉన్న శివాలయానికి 700 ఏళ్ల చరిత్ర ఉందని పురావస్తుశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడ శివలింగం స్వయంభూగా వెలసిందని, పూర్వం దీనిని తస్కరించేందుకు చూసినా కదలకపోవడంతో వదిలేశారని ఇలా పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అసలు ఈ శివలింగం ఎప్పటిదో తెలియజేయాలని సర్పంచ్‌ కోట్ల రఘుతోపాటు గ్రామపెద్దల విన్నపం మేరకు మంగళవారం పురావస్తుశాఖ ఏడీ ఆర్‌.ఫాల్గుణరావుతోపాటు కూడినబృందం కొవ్వాడ అగ్రహారంలోని శివాలయాన్ని సందర్శించింది. శివలింగంతోపాటు చుట్టుప్రక్కల దొరికిన శిథిలాలు, విరిగిన దేవతా విగ్రహాలను పరిశీలించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ శివలింగం 13, 14 శతాబ్దాల కాలం నాటిదని, తురుష్కుల పాలనలో చిన్నపాటిగా ఉన్న ఈ దేవాలయంలో విగ్రహాలను ధ్వంసం చేసి ఉండవచ్చునని తెలిపారు. కానీ, ముఖ్యమైన శివలింగం మాత్రం పాడవలేదని చెప్పారు. మిగిలిన దేవతామూర్తుల విగ్రహాలను మాత్రం విరగ్గొట్టారని అన్నారు. దీనికి సమీపంలో ఉన్న మహిషాసుర మర్ధిని అమ్మవారి విగ్రహం ఇంకా పురాతనమైనదిగా గుర్తించారు. నాడు ఈ ప్రాంతాన్ని తూర్పు గాంగులు పరిపాలించేవారని, వారి హయాంలో దీనిని నిర్మించి ఉండవచ్చునని పేర్కొన్నారు. ఇంత చరిత్ర ఉన్న శివాలయాన్ని స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల వారి సహకారంతో అభివృద్ధి చేస్తామని సర్పంచ్‌ రఘు తెలిపారు.

Updated Date - May 06 , 2025 | 11:14 PM