ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరలో రెండో విడత ‘తల్లికి వందనం’

ABN, Publish Date - Jul 03 , 2025 | 11:39 PM

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని ఇప్పటికే అమలు చేసింది.

ఇంటర్‌ విద్యార్థులు

- జిల్లాలో 18,195మంది విద్యార్థులకు కలగనున్న లబ్ధి

పార్వతీపురం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని ఇప్పటికే అమలు చేసింది. తొలి విడత ఈ పథకం కింద జిల్లాలో 1,08,951 మంది విద్యార్థులు అబ్ధిపొందారు. ఈ మేరకు 69,600 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం నగదు జమ చేసింది. ఇద్దరే కాదు నలుగురు పిల్లలున్నా కూడా ఒక్కొక్కరికీ రూ.13 వేల చొప్పున అందించారు. దీంతో తల్లులు సంతోషానికి అవధుల్లేవు. ఇప్పుడు రెండో విడత తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ సెకండియర్‌ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికీ సంబంధించి వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది.

జిల్లాలో పరిస్థితి ఇది..

జిల్లాలో ఈ నెల 2వ తేదీ వరకు 8,185 మంది విద్యార్థులు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందారు. ఈ నెలాఖరు వరకు కూడా మరికొందరు విద్యార్థులు కళాశాలల్లో చేరే అవకాశం ఉంది. 14 కేజీబీవీలు, ఆరు గురుకుల కళాశాలలు, నాలుగు మోడల్‌ స్కూళ్లు, ఐదు సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలు, 36 ప్రైవేటు కళాశాలల్లో బుధవారం వరకు 8,185 మంది విద్యార్థులు ఇంటర్‌లో చేరారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లలో ఈ నెల 2వ తేదీ వరకు 10,010 మంది విద్యార్థులు ఒకటో తరగతి ప్రవేశాలు పొందారు. బలిజిపేట మండలంలో 290 మంది, భామిని మండలంలో 460 మంది, గుమ్మలక్ష్మీపురం 882 మంది, గరుగుబిల్లి 315, జియ్యమ్మవలస 420, కొమరాడ 546, కురుపాం 862, మక్కువ 440, పాచిపెంట 651, పాలకొండ 842, పార్వతీపురం 1361, సాలూరు 1249, సీతంపేట 915, సీతానగరం మండలంలో 269 మంది, వీరఘట్టం మండలంలో 508 మంది విద్యార్థులు ఒకటో తరగతి ప్రవేశాలు పొందారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వీరిలో అర్హులందరికీ ఈ నెలలో తల్లికి వందనం నగదు వారి తల్లుల ఖాతాల్లో జమకానుంది. అలాగే, అర్హత ఉన్నా చాలామందికి మొదటి విడతలో తల్లికి వందనం నగదు అందలేదు. ఇలాంటి వారంతా సచివాలయాల్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతులు అందించారు. వీరికి రెండో విడతలో నగదు జమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. అనంతరం తల్లికి వందనం రెండో విడత నగదు తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Updated Date - Jul 03 , 2025 | 11:39 PM