ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజ్‌భవన్‌కు రాజు వెడలే..

ABN, Publish Date - Jul 25 , 2025 | 11:44 PM

గోవా రాష్ట్ర గవర్నర్‌గా పూసపాటి అశోక్‌ గజపతిరాజు శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

తన నివాసం (బంగ్లా) నుంచి గోవాకు బయలుదేరిన అశోక్‌ గజపతిరాజు, కుటుంబ సభ్యులు

- గోవాకు పయనమైన అశోక్‌ గజపతిరాజు, కుటుంబ సభ్యులు

- గవర్నర్‌గా నేడు బాధ్యతల స్వీకరణ

- ఆయన లేకపోవడంతో కళ తప్పిన బంగ్లా

విజయనగరం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): గోవా రాష్ట్ర గవర్నర్‌గా పూసపాటి అశోక్‌ గజపతిరాజు శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికోసం ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, జిల్లా టీడీపీ శ్రేణులు శుక్రవారం గోవాకుపయనమయ్యాయి. దీంతో కార్యకర్తలు, సందర్శకులతో నిత్యం కళకళలాడే అశోక్‌ గజపతిరాజు నివాసం (బంగ్లా) ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది. అశోక్‌ గజపతిరాజు తన బంగ్లాలో ఉన్నప్పుడు ఆయన అభిమానులు, స్నేహితులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడకు వస్తూ వెళ్తుండేవారు. జిల్లా నాయకులే కాకుండా కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం జిల్లాకు వచ్చారంటే అశోక్‌ బంగ్లాకి వెళ్లేవారు. ఈ పరిస్థితి టీడీపీ ఆవిర్భావం నుంచి ఉండేది. అశోక్‌ కుమార్తె అదితిగజపతిరాజు విజయనగరం శాసన సభ్యురాలు కావడంతో బంగ్లాకు సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉండేది. నిత్యం అశోక్‌ గజపతిరాజు బంగ్లా ప్రాంగణంలో ఉంటూ పార్టీ నాయకులతో మమేకం అవుతూ, వారికి సూచనలు, సలహాలు ఇస్తుండేవారు. అదే విధంగా అధిష్టానం పిలుపు మేరకు ఏ కార్యక్రమం చేపట్టినా అందులో ఆయన ఉండేవారు. తాజాగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. గోవా గవర్నర్‌గా నియామక ప్రకటన వచ్చిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి, బంగ్లాకే పరిమితమయ్యారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు గత వారం రోజులుగా ఆయనకు కలిసి శుభాకాంక్షలు తెలపడంతో బంగ్లాలో మరింత సందడి నెలకొనేది. ఇక నుంచి అశోక్‌ గజపతిరాజు టీడీపీకి దూరంగా ఉంటారన్న నిజాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదైమనప్పటికీ, అశోక్‌కి మంచి హోదా, విలువ దక్కిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jul 26 , 2025 | 11:13 AM