ఉత్తమ పాలన అందించడమే లక్ష్యం
ABN, Publish Date - Jul 12 , 2025 | 11:55 PM
ప్రజలకు ఉత్తమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
పార్వతీపురం/పార్వతీపురం టౌన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఉత్తమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శనివారం పార్వతీపురంలోని జగన్నాఽథపురంలోని ఒకటి, 30వ వార్డుల్లో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. అనంతరం బాల వీరాంజనేయస్వామి విలేకరులతో మాట్లాడుతూ ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్లు ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. కాగా పాత్రుడుకోనేరు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, జగన్నాథపురానికి చెందిన రైతులు మంత్రితో పాటు ఎమ్మెల్యే విజయచంద్రను కోరారు. జిల్లా కేంద్రం, మునిసిపాల్టీగా ఏర్పడక ముందు పాత్రుడు కోనేరు నీరు తాగేవారమని, కోనేరు అక్రమణలకు గురైయ్యిందని మంత్రి ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోనేరు గట్టును ఉద్యావన కేంద్రంగా అభివృద్ధి చేసి, గతంలా జగన్నాథపురం ప్రజలకు ఉపయోగపడేలా తయారుచేయాలని మంత్రిని కోరారు. దీంతో మంత్రి స్పందిస్తూ ఎమ్మెల్యే విజయచంద్రతోపాటు సంబంధిత అధికారులు పూర్వాపరాలను పరిశీలిం చి న్యాయం చేస్తారని హామీఇచ్చారు.విశ్వబ్రాహ్మణుల సమస్య పరిష్కరిం చాలని పట్టణ స్వర్ణకార సంఘ నాయకులు బి.రంగారావు ఆధ్వర్యంలో సభ్యులు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
సీతానగరం, జూలై 12(ఆంధ్రజ్యోతి):రాష్ట్రప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టిసారించిందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మౌలిక సదు పాయాలకోసం ప్రత్యేక శ్రద్ధతీసుకుంటుందని మంత్రి డోల బాలవీరాంజనేయస్వామి తెలిపారు. జోగింపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల తరగతి, వం ట గదులు, మరుగుదొడ్లును పరిశీలించారు. బాత్ రూములు, స్నానపు గదులు పాడవడంతో తక్షణమే శుభ్రపరచాలని ప్రిన్సిపాల్ కె.ఈశ్వరరావుకు సూచిం చారు.పదోతరగతి, ఇంటర్‌విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు అందిస్తామని హామీఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ఎస్.రూపవతి, ప్రిన్సిపాల్ కె.ఈశ ్వరరావు, నాయకులు వెంకటనాయుడు, పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. నిడగల్లులో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కలిసి నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు, కార్యదర్శులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి
పార్వతీపురం, జూలై 12 (ఆంధ్రజ్యోతి):దివ్యాంగుల సమస్యలు వెం టనే పరిష్కరించాలని అధికారులను మంత్రి బాలవీరాంజనేయు లు ఆదేశించారు. పార్వతీపురంలో ఆ శాఖ ఉద్యోగులు, దివ్యాంగులు పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.కొంతమంది దివ్యాం గులు తమశాఖకు సంబంధించి సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరారు. మరికొంతమంది తమకు పింఛన్లు మంజూరు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలను అందించారు.
కలెక్టర్‌కు అభినందన
వసతిగృహాల్లో విద్యార్థులకు వసతులు కల్పించేందుకు సీఎస్‌ఆర్ ద్వారా నిధులు సమకూర్చి ఏర్పాటు చేస్తున్న కలెక్టర్ ఎ.శ్యాం ప్రసా ద్‌ను మంత్రి డోల బాలవీరాంజనేయస్వామి అభినందించారు. జిల్లా అధికారయంత్రాంగం చర్యతీసుకోవడం అభినందనీయమని, కలెక్టర్‌తో పాటు అధికారులందరినీ అభినందిస్తున్నానని మం త్రి పేర్కొన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 11:55 PM