ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బంగారు కుటుంబాల సాధికారత సాధనే లక్ష్యం

ABN, Publish Date - Jul 28 , 2025 | 12:17 AM

పేదరిక నిర్మూలన పోరులో బంగా రు కుటుంబాల సాధికారత సాధనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

గజపతినగరం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలన పోరులో బంగా రు కుటుంబాల సాధికారత సాధనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొనిస గ్రామంలో ఆయన పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల 50వేల మందికి ప్రతినెల రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి సన్నాహాలు చేపడుతున్నట్టు తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి పనులు చేపట్టామని, జిల్లాలో ఇప్పటికే మూడు ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని చెప్పారు. మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీధర్‌, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, ఆండ్ర ప్రాజెక్టు చైర్మన్‌ కోడి సతీష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ లెంక బంగారు నాయుడు, నాయకులు శీరం రెడ్డి రామ్‌కుమార్‌, ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 12:17 AM