పర్యావరణాన్ని పరిరక్షించాలి
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:03 AM
ప్రతిఒక్కరూ మొుక్కలు నాటి పర్యా వరణాన్ని పరిరక్షించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. పండ్ల మొక్కలు పెంపకంతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చుని తెలిపారు. మంగళవారం మండలంలోని గాబువానిపాలెంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.
భోగాపురం, జూలై8 (ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ మొుక్కలు నాటి పర్యా వరణాన్ని పరిరక్షించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. పండ్ల మొక్కలు పెంపకంతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చుని తెలిపారు. మంగళవారం మండలంలోని గాబువానిపాలెంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.
ఫడెంకాడ, జూలై 8(ఆంధ్రజ్యోతి):పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వా ములం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. మండలంలోని పేడాడ గ్రామంలో మంగళవారం హార్టికల్చర్ ఫ్లాంటేషన్‌కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో టీడీపీ మండలా ధ్యక్షులు పల్లె భాస్కరరావు, సంఘం సురేష్, బి.రవికుమార్, ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, మండల జనసేన పార్టీ కోఆర్డినేటర్ పైలా శంకర్ పాల్గొన్నారు.
నెల్లిమర్ల, జూలై 8(ఆంధ్రజ్యోతి): మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు. మండలంలోని తం గుడుబిల్లి, ఏటీ.అగ్రహారం, ఒమ్మి గ్రామాల్లో టీడీపీ నాయకుడు సువ్వాడ రవి శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
Updated Date - Jul 09 , 2025 | 12:03 AM