ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

that family has happy a lot ఆ ఇంట నాలుగింతల ఆనందం

ABN, Publish Date - Jun 15 , 2025 | 11:55 PM

that family has happy a lot తల్లికి వందనం పథకంతో ఆ పేదింట ఆనందం వెల్లివిరుస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలోని భార్యాభర్తలిద్దరూ కూలిపనులు చేసుకుంటూ నలుగురు పిల్లల్ని సాకుతున్నారు. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

నలుగురు పిల్లలతో శ్రీను దంపతులు

ఆ ఇంట నాలుగింతల ఆనందం

నలుగురు పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తింపు

తల్లి ఖాతాలో రూ.52 వేలు జమ

రాజాం రూరల్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకంతో ఆ పేదింట ఆనందం వెల్లివిరుస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలోని భార్యాభర్తలిద్దరూ కూలిపనులు చేసుకుంటూ నలుగురు పిల్లల్ని సాకుతున్నారు. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాదాసీదాగా సాగుతున్న ఆ ఇంట తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లి ఖాతాలో ఒక్కసారిగా రూ.52 వేలు జమ కావడంతో భార్యాభర్తల ఆనందానికి అవధుల్లేవు. విడతలవారీగా నిధులు జమవుతున్న నేపధ్యంలో ఆ తల్లి ఖాతాలో ఈనెల 14న రాత్రి సమయానికి రూ.52 వేలుజమయ్యాయి. ఆదివారం ఉదయం ఖాతాలో పెద్దమొత్తం కనిపించడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. రాజాం పట్టణంలోని చిన్నచెరువు గట్టుమీద జీవిస్తున్న షేక్‌ శ్రీను, మదీనాలది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఈ దంపతులకు ఇద్దరు ఆడ, ఇద్దరు మగ పిల్లలు. నాగ్మీ, సారియా, సిరాజ్‌ అయిదో తరగతి చదువుతుండగా, ఫిరాజ్‌ ఒకటో తరగతి చదువుతున్నాడు. వీరికి సంబంధించి తల్లికి వందనం పథకంలో భాగంగా ఒక్కొక్కరికీ రూ.13 వేలు వంతున తల్లి మదీనా అకౌంట్‌లో శనివారం రాత్రి నాటికి రూ.52 వేలు నగదు జమయ్యింది. దీంతో వారింట ఆనందం వెల్లువిరుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం కింద ఒక్కరికే రూ.13 వేలు ఇచ్చారని, సీఎం చంద్రబాబునాయుడి దయ వల్ల తమ నలుగురు పిల్లలకు పథకం వర్తించిందని మదీనా తెలిపారు.

Updated Date - Jun 15 , 2025 | 11:55 PM