ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Thank You, CM Sir! థాంక్యూ సీఎం సార్‌!

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:02 AM

Thank You, CM Sir! పాచిపెంట మండలంలో పూడి నుంచి కేరంగి వరకు నిర్మించిన ఎనిమిది కిలో మీటర్ల మేర బీటీ రోడ్డును సోమవారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. అనంతరం పూడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

విద్యార్థినులతో ముచ్చటిస్తున్న మంత్రి సంధ్యారాణి

విద్యార్థులతో మంత్రి ముచ్చట్లు

పాచిపెంట, జూలై7(ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండలంలో పూడి నుంచి కేరంగి వరకు నిర్మించిన ఎనిమిది కిలో మీటర్ల మేర బీటీ రోడ్డును సోమవారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. అనంతరం పూడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ‘గతంలో బురదలో నడుచుకుంటూ స్కూల్‌కి వెళ్లి వచ్చేవారు. ఇప్పుడు రోడ్డు వేశాం బాగుందా.’ అని ఓ విద్యార్థినిని ప్రశ్నించారు. ‘బాగుంది మేడమ్‌’ అంటూ ఆ బాలిక సమాధానమిచ్చింది. ‘ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రోడ్డు వేయించారని, ఆయనకు థాంక్యూ చెప్పు.’ అని మంత్రి అన్నారు. వెంటనే ఆ విద్యార్థిని ‘థాంక్యూ సీఎం సార్‌’ అని చెప్పింది. దీంతో మంత్రితో పాటు అక్కడున్న అధికారులు, ఉపాధ్యాయులు చిరునవ్వులు చిందించారు.

Updated Date - Jul 08 , 2025 | 12:02 AM