ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TB క్షయ నిర్మూలనే లక్ష్యం

ABN, Publish Date - Mar 25 , 2025 | 12:00 AM

TB Eradication is the Goal క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని.. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రాజెక్టు అశుతోష్‌ శ్రీవాత్సవ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

డీఎంహెచ్‌వోను సన్మానిస్తున్న ఇన్‌చార్జి పీవో

పార్వతీపురం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని.. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రాజెక్టు అశుతోష్‌ శ్రీవాత్సవ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్‌జీవో హోమ్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీ పరీక్షలు జరుపుతున్నట్లు తెపాఆరు. ఎక్స్‌రే యంత్రాలు, ఆధునికమైన సిబినాట్‌, 19 ఆర్‌టీపీసీఆర్‌ టీబీ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యాధిగ్రస్థులకు ఆరు నెలలకు సరిపడా మందులు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ప్రతి నెలా రూ.వెయ్యి వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు మాట్లాడుతూ.. రోగులు క్రమం తప్పకుండా మందులు తప్పకుండా వేసుకునేలా సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి ఎం.వినోద్‌కుమార్‌, ఆర్‌బీఎస్‌కే సమన్వయ అధికారి పి.ఎల్‌.రఘుకుమార్‌, ఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు కిషోర్‌ తదితరులున్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:00 AM