ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దారి దోపిడీ కేసులో నిందితుల అరెస్టు

ABN, Publish Date - Jul 27 , 2025 | 12:23 AM

లారీ డ్రైవర్‌పై దాడి చేసి, రూ.6వేల నగదు తోపాటు సెల్‌ఫోన్‌ లాక్కెళ్లిన యువకులను విజ యనగరం రూరల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

విజయనగరం క్రైం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): లారీ డ్రైవర్‌పై దాడి చేసి, రూ.6వేల నగదు తోపాటు సెల్‌ఫోన్‌ లాక్కెళ్లిన యువకులను విజ యనగరం రూరల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈఘటనపై విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు స్థానిక విలేకర్లకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లాకు చెందిన సాహుకర్‌ సంతోష్‌ కుమార్‌ అనే లారీ డ్రైవర్‌ ఈనెల 19వ తేదీ రాత్రి లారీపై కర్రల లోడుతో వెళ్తుండగా.. చెల్లూరు బైపాస్‌ రోడ్డులో కొంతమంది యువకులు రెండు స్కూటీ లతో అడ్డగించారు. లారీ డ్రైవర్‌ తలపై రాడ్‌తో కొట్టారు. అతని వద్ద ఉన్న రూ.6వేల నగదుతో పాటు సెల్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయారు. దీంతో సంతోష్‌ కుమార్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈనెల 25న మధ్యాహ్నం సీఐ లక్ష్మణరావుకు వచ్చిన సమాచారంతో ఎస్‌ఐలు అశోక్‌కుమార్‌, సాయికృష్ణ, హెచ్‌సీ నాగేంద్రప్రసాద్‌, అచ్చిరాజు, పీసీలు ఎస్‌.రమణ, రామకృష్ణ, రామారావు ప్రతాప్‌లు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో లంకాప ట్టణానికి చెందిన చెన్నా అఖిల్‌తో పాటు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసు కున్నారు. విచారించగా, నేరం చేసినట్టు అంగీకరించారు. వీరి వద్ద నుంచి నాలు గు స్కూటీలు, 1,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై భీమిలి పోలీసు స్టేషన్‌, టూటౌన్‌, వన్‌టౌన్‌, విజయనగరం రూరల్‌ పోలీసు స్టేషన్‌లలో కేసులు ఉన్నాయి. కేసులు ఛేదించిన ఎస్‌ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Updated Date - Jul 27 , 2025 | 12:23 AM