ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సర్వేలు పక్కాగా నిర్వహించాలి

ABN, Publish Date - May 06 , 2025 | 11:56 PM

:ప్రజారోగ్య సర్వేలు పక్కాగా నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ టి.జగన్మోహన్‌రావు తెలిపారు. మం గళవారం మక్కువ, సంబర పీహెచ్‌సీల్లో ఆశాడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామానికి సంబంధించి ఇంటింటా సర్వే, గర్భిణుల నమోదు,కాన్పు వివరాలు, కుటుంబ నియంత్రణ, సంక్రమిత, అసంక్రమిత వ్యాధులు వివరాలు ఎప్పటికప్పుడు నమోదుచేయాలన్నారు.

మాట్లాడుతున్న జగన్మోహన్‌రావు:

మక్కువ, మే 6 (ఆంధ్రజ్యోతి):ప్రజారోగ్య సర్వేలు పక్కాగా నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ టి.జగన్మోహన్‌రావు తెలిపారు. మం గళవారం మక్కువ, సంబర పీహెచ్‌సీల్లో ఆశాడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామానికి సంబంధించి ఇంటింటా సర్వే, గర్భిణుల నమోదు,కాన్పు వివరాలు, కుటుంబ నియంత్రణ, సంక్రమిత, అసంక్రమిత వ్యాధులు వివరాలు ఎప్పటికప్పుడు నమోదుచేయాలన్నారు. బాల్యంలో పిల్లల ఆరోగ్య సంరక్షణ, ఎదుగుదల క్రమంలో ఆరోగ్య సమస్యలు, లోపాలు ముందుగానే గుర్తించాలన్నారు. క్షేత్రస్థాయిలో జ్వరాలు గుర్తించడంలో జాప్యం ఉండరాదని, ఫీవర్‌ సర్వే సక్రమంగా నిర్వహించాలన్నారు. దోమలనివారణకు కొనసాగుతున్న ఐఆర్‌ఎస్‌కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో జరిగేలా పర్యవేక్షించాలన్నారు.గ్రామాల్లో ఆరోగ్య సమ స్యలు గుర్తిస్తే సత్వరమే ఆశాకార్యకర్తలు తెలియజేయాలన్నారు.ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వైద్యసిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందుతున్న తీరు, ఆరోగ్య కార్యక్రమం అమలుపై సమీక్షించారు. నివేదికలు, ఆశ సర్వే, రికార్డులు పరిశీలించా రు.కార్యక్రమంలో మక్కువ,సంబర పీహెచ్‌సీల వైద్యాధికారులు జి.హరికృష్ణ, ఎంవీ కిరణ్‌కుమార్‌, ఎపిడమిక్‌ ఈవో సత్తిబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:56 PM