ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Surveillance must be increased.. నిఘా పెంచాలి.. మాదక ద్రవ్యాలు అరికట్టాలి

ABN, Publish Date - May 31 , 2025 | 11:30 PM

Surveillance must be increased.. Drug abuse must be stopped ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెంచి జిల్లాలో మాదక ద్రవ్యాలను అరికట్టాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, మే 31 (ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెంచి జిల్లాలో మాదక ద్రవ్యాలను అరికట్టాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ జిల్లాలో వాహనాల తనిఖీలను మరింత పెంచాలి. మున్సిపాలిటీల్లో కనీసం ఐదు వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ బస్సుల్లో కూడా అవగాహన పోస్టర్లను పెట్టాలి. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు 1972 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు అందించేలా చర్యలు తీసుకోవాలి. అటవీశాఖ అధికారులు కూడా ఇందులో భాగస్వాములవ్వాలి.’ అని తెలిపారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. ‘ జిల్లాలో అధికమొత్తంలో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్న హాట్‌ స్పాట్‌లను గుర్తించాం. ఆయా చోట్ల నిఘా పెంచడానికి చర్యలు చేపడుతున్నాం. క్యూఆర్‌ కోడ్‌లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి మాదక ద్రవ్యాల సమాచారం తెలుసుకుంటాం. ఇప్పటికే 21 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 7,841 మంది ప్రజలు పాల్గొని స్పందన అందించారు. జిల్లాలో విస్తృతంగా డ్రోన్‌ సర్వేలు నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక క్లబ్‌లు ఏర్పాటు చేస్తాం. జనవరి నుంచి ఇప్పటివరకు మాదక ద్రవ్యాలకు సంబంధించి 11 కేసులను నమోదు చేశాం. ఇందులో 1,875 కేజీల గంజాయి రవాణా కేసు కూడా ఉంది.’ అని చెప్పారు. రవాణాశాఖ అధికారి ఎం.శశికుమార్‌ మాట్లాడుతూ... ‘ ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నాం. ఇప్పటివరకు 199 కేసులను నమోదు చేశాం.’ అని వెల్లడించారు. జిల్లాలో పకడ్బందీగా నవోదయ రెండో దశను అమలు చేస్తున్నామని ఎక్సైజ్‌ శాఖాధికారులు తెలిపారు. 27 గ్రామాలను సారా రహితంగా ప్రకటించినట్లు వెల్లడించారు. 50 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామన్నారు. నాటుసారా తయారీకి 64 మంది బెల్లం వ్యాపారులు సహకరిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.హేమలత, ఏఎస్పీ అంకిత సురాన, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

రూ.48.42 లక్షల పరిహారం చెల్లింపు

జిల్లాలో 43 ఎస్సీ, ఎస్టీ కేసులకు రూ.48.42 లక్షలు పరిహారంగా చెల్లించినట్లు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. మరో 40 కేసులకు రూ.54.50 లక్షలు చెల్లించాల్సి ఉందని, ఆరు కేసుల విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే అన్ని వసతిగృహాలు, పాఠశాలలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. విద్యార్థులకు తక్షణ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ... భూ సంబంధిత వివాదాల కారణంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. విజిలెన్స్‌ అండ్‌ మానటరింగ్‌ కమిటీలో జిల్లా స్థాయి అధికారులను సభ్యులుగా నియమించాలన్నారు.

Updated Date - May 31 , 2025 | 11:30 PM