Summer Sports Training Camps 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
ABN, Publish Date - Apr 26 , 2025 | 11:54 PM
Summer Sports Training Camps from the 1st జిల్లాలో వచ్చేనెల ఒకటో తేదీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 25 మంది బాలురు, 25 మంది బాలికలతో కూడిన బ్యాచ్‌తో శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు
బెలగాం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వచ్చేనెల ఒకటో తేదీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 25 మంది బాలురు, 25 మంది బాలికలతో కూడిన బ్యాచ్‌తో శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రోజూ ఉదయం 6 నుంచి 8గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్ బాల్, బాక్సింగ్, బ్యాడ్మెంటన్, క్రికెట్, చెస్, ఫెన్సింగ్, హ్యాండ్ బాల్, కరాటే, ఖోఖో తదితర వాటిల్లో తర్ఫీదు ఇస్తామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 8 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి ప్రతిభావంతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వేసవి సెలవులను విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. 2,500 మంది క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు.
Updated Date - Apr 26 , 2025 | 11:54 PM