Summer Holidays రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
ABN, Publish Date - Apr 22 , 2025 | 11:51 PM
Summer Holidays for Schools Starting Tomorrow పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులను ప్రకటిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వి.విజయ రామరాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఇప్పటికే పరీక్షలు ముగిశాయి.
సాలూరు రూరల్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులను ప్రకటిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వి.విజయ రామరాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఇప్పటికే పరీక్షలు ముగిశాయి. వేసవి సెలవులకు ముందే విద్యార్థుల నమోదు కార్యక్రమం సైతం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఉన్న 1789 ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
Updated Date - Apr 22 , 2025 | 11:51 PM