నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి..
ABN, Publish Date - Jun 22 , 2025 | 12:12 AM
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప టికే జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా బొబ్బిలి కార్మికులు ఆదివారం అర్ధ రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు.
బొబ్బిలి, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప టికే జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా బొబ్బిలి కార్మికులు ఆదివారం అర్ధ రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్మికులంతా కలిసి శనివారం స్థానిక మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్‌బాబుకు, కమిషనర్ లాలం రామలక్ష్మికి వేర్వేరుగా సమ్మె నోటీసులను అందజేశారు. ఈసందర్భం గా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజులుగా తమ సోదర కార్మికులు సమ్మె చేస్తున్నారని, తాము మా త్రం సమ్మెకు వెళ్లలేదని, నిరసనలతో సరిపెట్టామన్నారు. సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో వారికి మద్దతుగా ఆదివారం అర్ధరాత్రి నుంచి తాము కూడా సమ్మెకు వెళ్తున్నామని చెప్పారు. పట్టణ ప్రజలకు తాగునీటి సరఫ రాకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంలో ఇంజ నీరింగ్ విభాగంలో ఉన్న వాటర్ సప్లయి కార్మికులు మరో మూడు రోజులు పాటు ఆగి సమ్మెలోనికి దిగుతారని చెప్పారు. ఈనెల 25న అర్ధరాత్రి నుంచి వారి తో పాటు మేమంతా కలిసి సమ్మెలోనికి వెళతామన్నారు. తమ సమ్మె ప్రభావంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఇతర సమస్యలొచ్చినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిం చాల్సి ఉంటుందని వారు తెలిపారు. సమ్మెలో ఉన్న ము న్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం, చర్చల పేరుతో కాలయాపన చేస్తు న్నందు వల్లే తాము కూడా పూర్తిస్థాయిలో సమ్మెకు వెళుతున్నట్టు వారు వివరించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియ న్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మజ్జి ఈశ్వరరావు, తెంటు రవి ఆధ్వర్యంలో కార్మికులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2025 | 12:12 AM