ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Still Not Fully Complete! ఇంకా పూర్తికాలే!

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:04 AM

Still Not Fully Complete! సాలూరు పట్టణంలోని వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం ఇంకా పూర్తి కావడం లేదు. ఈ ఏడాది మార్చిలోనే పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. కానీ, మూడు నెలలు గడుస్తున్నా అతీగతి లేదు. ఇంకా భవనాలు అసంపూర్తిగానే దర్శనమిస్తుండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

నిర్మాణంలో ఉన్న వంద పడకల (ఏరియా) ఆసుపత్రి భవనం
  • ఈ ఏడాది మార్చిలో పూర్తిచేస్తామన్న అధికారులు

  • ఇప్పటికీ అతీగతి లేని వైనం..

  • మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారుల వెల్లడి

  • రోగులకు తప్పని అవస్థలు

సాలూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): సాలూరు పట్టణంలోని వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం ఇంకా పూర్తి కావడం లేదు. ఈ ఏడాది మార్చిలోనే పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. కానీ, మూడు నెలలు గడుస్తున్నా అతీగతి లేదు. ఇంకా భవనాలు అసంపూర్తిగానే దర్శనమిస్తుండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వేళల్లో కొందరు విజయనగరం, విశాఖకు పరుగులు తీయాల్సి వస్తోంది. మరో రెండు నెలల్లో పనులన్నీ పూర్తిచేస్తామని తాజాగా అధికారులతో పాటు మంత్రి సంధ్యారాణి చెబుతున్నారు. దీంతో ఈసారైనా వంద పడకల ఆస్పత్రి భవనం ప్రారంభిస్తారో లేదో వేచిచూడాలి.

ఇదీ పరిస్థితి..

- సాలూరు నియోజకవర్గంతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని వివిధ గ్రామాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో సాలూరులో ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి మంత్రి సుంజయ్‌కృష్ణ రంగారావు చేతుల మీదుగా భూమి పూజా కూడా చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాగా 2020లో సుమారు రూ.17కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. అయితే, రూ.8.50 కోట్ల పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు జగన్‌ సర్కారు కేవలం రూ.3కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.5.50 కోట్ల మేర బిల్లులు చెల్లించకపోవడంతో చాలాకాలం పనులు నిలిచిపోయాయి.

- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేసింది. దీంతో ఆస్పత్రి పనులు ముందుకు కదిలాయి. ఈ ఏడాది మార్చి లోగా వంద పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. కానీ, మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పనులు అసంపూర్తిగా ఉండడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన రోగుల తాకిడి..

ప్రస్తుతం సాలూరులో ఉన్న 30 పడకల ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. వ్యాధులు సీజన్‌ కావడంతో రోజూ 300 మంది నుంచి 500 మంది వరకు ఆసుపత్రికి వస్తున్నారు. 150 మంది వరకు ఇన్‌పేషేంట్లుగా చేరుతున్నారు. అయితే సరైన వసతి, సరిపడిన పడకలు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక మంచంపై ఇద్దరు ముగ్గురు రోగులకు వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా వంద పడకల ఆస్పత్రి భవనం పనులు పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

మరో రెండు నెలల్లో పూర్తి

సాలూరు పట్టణంలోని వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. ఆ వెంటనే ఆస్పత్రిని ప్రారంభిస్తాం. సాలూరు, మక్కువ, పాచిపెంట, మెంటాడ మండలాలతో పాటు రామభద్రపురం, బాడంగి మండలాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. అన్ని రకాల వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుతాయి.

-గుమ్మిడి సంధ్యారాణి, మంత్రి

=================================

త్వరలో భవనాన్ని అప్పగిస్తాం

సాలూరు వంద పడకల ఆసుపత్రి భవనం పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. ఇప్పటికే రూ.8కోట్లు విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు అప్‌లోడ్‌ అయ్యే అవకాశం లేకపోవడంతో నిధుల మంజూరులో జాప్యం జరిగింది. పనులు జరిగిన వాటికి సంబంధించి రూ.5కోట్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం వర్షాలు జోరుగా కురుస్తుండడంతో ట్రాన్స్‌ఫార్మర్లు బిగించ లేకపోతున్నాం. ఏదేమైనా మరో పది శాతం పనులను ఈ నెలఖరులోగా లేదా వచ్చే నెలఖరులోగా పూర్తిచేసి ఆసుపత్రి భవనాన్ని అప్పగిస్తాం.

-నరేంద్ర, డీఈ, సాలూరు ఏరియా ఆసుపత్రి

Updated Date - Jul 08 , 2025 | 12:04 AM