ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Still 40% Remains... ఇంకా 40 శాతం కాలే..

ABN, Publish Date - Jun 29 , 2025 | 11:38 PM

Still 40% Remains... ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు విత్తు వేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో తీవ్రంగా మథనపడుతున్నారు. ఖరీఫ్‌ కాలం ప్రారంభమై రెండు కార్తెలు పూర్తయ్యాయి. అధిక వర్షాలతో ఇప్పటి వరకు జిల్లాలో 40 శాతం కూడా విత్తనాలు వేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు.

పాలకొండ మండలం వెలగవాడలో పదును సక్రమంగా లేకపోవడంతో వెదురుకంపపై బరువు పెట్టి విత్తనాలను మట్టిలో కలుపుతున్న రైతులు
  • రైతులకు సహకరించని వాతావరణం

  • అధిక వర్షాలతో విత్తు వేసేందుకు అవస్థలు

పాలకొండ, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు విత్తు వేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో తీవ్రంగా మథనపడుతున్నారు. ఖరీఫ్‌ కాలం ప్రారంభమై రెండు కార్తెలు పూర్తయ్యాయి. అధిక వర్షాలతో ఇప్పటి వరకు జిల్లాలో 40 శాతం కూడా విత్తనాలు వేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో ఖరీఫ్‌ కింద ఈ ఏడాది 2.2 లక్షల ఎకరాల్లో వరితో పాటు వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనాలు వేశారు. ఈ దిశగా రైతులు ఖరీఫ్‌ పనులకు సన్నద్ధమవుతున్నప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పనులు ముందుకు సాగడం లేదు.

విభిన్న పద్ధతుల్లో..

- వాస్తవంగా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో అధిక వర్షాలు లేకుంటే.. ఇప్పటికే అన్నదాతలు పొడి పద్ధతిలో నారు మడులను సిద్ధం చేసుకుని విత్తనాలు జల్లేవారు. ఆ తర్వాత కురిసే వర్షాలకు ఆ విత్తు మొలకెత్తి నారు పెరిగితే నాట్లు వేసేందుకు ఉపక్రమించేవారు. ఒకవేళ వర్షాలు కాస్త అధికంగా కురిసినా.. సాగునీరు అందుబాటులో ఉండే రైతులు నారుమడిని దమ్ముపట్టి బురదలోనే వరి విత్తనాలు జల్లేవారు. ఇవి మొలకెత్తడం ద్వారా నారు సిద్ధమైతే నాట్లు వేస్తారు. కూలీల కొరతను అధిగమించేందుకు ఇప్పటికే ఎద పద్ధతిలో సాగుకు సిద్ధమయ్యేవారు. అయితే ఈ మూడు పద్ధతుల్లోనూ విత్తనాలు జల్లేందుకు రైతులు సిద్ధమవుతున్నా.. ప్రకృతి మాత్రం వారికి సహకరించలేదు.

- అధిక వర్షాలతో పొలాలు పదును ఇవ్వకపోవడంతో రైతులు విభిన్న పద్ధతుల్లో వరి విత్తనాలు జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా నారుమడులు బురదమయంగానే ఉండడంతో కలుపును తొలగించి కొంటెగర్రలు, పారలు, ఇనుప గొర్రె వంటి పరికరాలతో విత్తనాలు జల్లుతారు. అనంతరం మట్టిలో విత్తనాలను కలుపుతున్నారు. మరికొంతమంది నారు మడి కాస్త పదును ఉందనుకుంటే విత్తనాలు వేస్తున్నారు. ఎండిన కంప పెట్టి దానిపై బరువు వేసి నారు మడుల్లో తిరుగుతున్నారు. ఇలా చేయడం ద్వారా విత్తనాలు మట్టిలో కలుస్తాయని రైతుల ఆలోచన. ఇంకొంతమంది పూర్తిగా బురదమయమైన పొలంలో కలుపును తొలగించి ట్రాక్టర్లు లేదా పశువులకు దమ్ము పట్టి వరిడాకు పద్దతిలో విత్తనాలు జల్లుతున్నారు. ఇలా జిల్లాలోని రైతాంగం త్తనాలు వేసేముందు చిత్తు అవుతున్నారు.

అంచనాలు తారుమారు...

జిల్లావ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో ఎద పద్ధతిలోనే వరి సాగు అవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఎద పద్ధతిలో సాగు సాధ్యం కావడం లేదు. అధిక వర్షాలతో ఎదకు అవసరమైన విధంగా పొలాలను రైతులు సిద్ధం చేయలేకపోతున్నారు. పొలాల్లో అధికంగా కలుపు పెరుగుతుండగా.. పదును కూడా దొరకడం లేదు. దీంతో కేవలం 15 వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పడిపోయే పరిస్థితి ఉంది. ఖరీఫ్‌ కింద వరితో పాటు పత్తి మొక్కజొన్న, కంది, చిరు ధాన్యాల పంటలు వేసే రైతులంతా ఒకేసారి వ్యవసాయ పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల వారు కూలీల సమస్యను కూడా ఎదుర్కోవల్సి వస్తుంది.

మొలక శాతంపై ప్రభావం

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వివిధ పద్ధతుల్లో విత్తనాలు జల్లుతున్నారు. అయితే దీనివల్ల కొంత మేర మొలక శాతం తగ్గే అవకాశం ఉంది. నారుమడుల్లో విత్తనాలు మొలకెత్తిన తర్వాత సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడే నాణ్యమైన నారును నాట్లు వేసుకునే అవకాశం కలుగుతుంది.

- ప్రసాదరావు, మండల వ్యవసాయాధికారి, పాలకొండ

Updated Date - Jun 29 , 2025 | 11:38 PM