ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రోత్‌సెంటరులో భూముల ధర తగ్గింపునకు చర్యలు

ABN, Publish Date - Jun 18 , 2025 | 11:59 PM

బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటరులో భూముల ధరలు తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నామని జిల్లా ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

మాట్లాడుతున్న మంత్రి కొండపల్లి
  • మంత్రి కొండపల్లి

బొబ్బిలి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటరులో పారిశ్రామికవేత్తల రాక మందకొడిగా ఉండడానికి భూముల ధర అధికంగా ఉండడం ఓ కారణమని గుర్తించామని, ఈ ధరలు తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నామని జిల్లా ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. బొబ్బిలి కోటలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బొబ్బిలి గ్రోత్‌ సెంటరులో పారిశ్రామిక అభివృద్ధి ఇంకా పుంజుకోకపోవడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మార్గదర్శకాలు సడలిస్తే..

మరికొంతమందికి తల్లికి వందనం

తల్లికి వందనం నిధులను ఇతర చిరుద్యోగులు, కార్మికుల పిల్లలకు వర్తింపజేయాలని వారంతా అడుగు తున్నారు కదా.. దానిపై మంత్రిని ప్రశ్నించగా ఆయన వివరణ ఇచ్చారు. పేదరికం నిర్వచనంపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలున్నాయి.. వాటిని సడలిస్తేనే ఇంకా మరికొం తమందికి పథకాన్ని వర్తింపజేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. దీనిపై చర్చలు జరుగుతున్నా యని చెప్పారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాలలో రూ.12వేలు లోపు ఉన్న వారిని పేదరికపు సూచీలో ఉన్నట్టు పరిగణిస్తు న్నామని తెలిపారు. ఏడాది ప్రభుత్వ పాలనలో 140 హామీలను నెరవేర్చామని చెప్పారు. తల్లికి వందనం పథకంలో 67లక్షల మందికి డబ్బులు చెల్లించడంతో ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతున్నారన్నారు. మామిడి పండ్ల గుజ్జుపై జీఎస్‌టీని తగ్గించాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారని చెప్పారు. కొట్టక్కిలో ఎంఎస్‌ఎంఈ పార్కు పనులకు టెండరు ప్రక్రియ పూర్తి అయ్యిందని, వార్క్‌ ఆర్డరు ఇచ్చామని చెప్పారు. కిరోసిన్‌ ఇంజన్లు కావాలని చాలామంది చిన్న రైతులు చాలా ఏళ్ల నుంచి అడుగుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా, కిరోసిన్‌ లభ్యత ఇప్పుడు లేదని, ప్రత్యామ్నాయంపై పరిశీలిస్తామని బదులిచ్చారు.

యోగా దినోత్సవానికి 30వేలమంది

విశాఖలో ఈనెల 21న 5లక్షల మందితో యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లా నుంచి 30వేల మందిని తరలిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు, జనసేన ఇన్‌చార్జి గిరడ అప్పలస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:59 PM