ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Steps are being taken to ensure free bus travel ఉచిత బస్సు ప్రయాణానికి వడివడిగా అడుగులు

ABN, Publish Date - Jul 28 , 2025 | 12:33 AM

Steps are being taken to ensure free bus travel మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిపోల వారీగా ఉన్న బస్సులు, వాటి సామర్థ్యం, రూట్ల వారీగా ప్రయాణికుల రద్దీ, మహిళా ప్రయాణికులపై అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశారు.

ఉచిత బస్సు ప్రయాణానికి

వడివడిగా అడుగులు

మహిళలకు ఊరట

ఆగస్టు 15 నుంచి అమలుకు చర్యలు

ప్రతిపాదనలు పంపిన జిల్లా అధికారులు

కొత్త బస్సులు అవసరమని నివేదికలు

నెలాఖరుకు మార్గదర్శకాలు వచ్చే అవకాశం

- మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 నుంచి అమలు చేసి తీరుతాం. అందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నాం. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ కనుక అమలు చేస్తాం.

- సీఎం చంద్రబాబు ఇటీవల చేసిన ప్రకటన ఇది.

- ఏపీఎస్‌ఆర్టీసీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులకు సంబంధించి మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. కొత్త బస్సుల ఏర్పాటుతో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, బస్టాండ్లను ఆధునీకరిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అన్ని జిల్లాల్లో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

- జిల్లా పర్యటనకు ఇటీవల వచ్చిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చేసిన ప్రకటన ఇది.

విజయనగరం, జూలై 27(ఆంధ్రజ్యోతి): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిపోల వారీగా ఉన్న బస్సులు, వాటి సామర్థ్యం, రూట్ల వారీగా ప్రయాణికుల రద్దీ, మహిళా ప్రయాణికులపై అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, ఎస్‌.కోట, సాలూరు, పాలకొండలో ఆర్టీసీ డిపోల్లో 450 బస్సులు ఉన్నాయి. ప్రతిరోజూ 1.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి. రోజుకు సగటున 95 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. అందులో మహిళలు 37 వేల మంది వరకూ ఉన్నారు. ఉమ్మడి జిల్లాను ప్రామాణికంగా చేసుకుని మహిళలకు పల్లెవెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లతో పాటు సిటీ ఆర్డీనరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు 179 సర్వీసులు నడుస్తున్నాయి. మరో 11 బస్సులు ఇటీవల కొత్తగా వచ్చాయి. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి మరో 20 బస్సులు అవసరం అవుతాయి. అలాగే మన్యం జిల్లాకు సంబంధించి మరో 40 బస్సుల వరకూ అవసరం ఉంటుందని సంబంధిత అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు.

వసతులు మెరుగుపరిస్తేనే..

వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసింది. కాంప్లెక్స్‌లు, బస్టాండ్లను కనీసం అభివృద్ధి చేయలేదు. ఇప్పటికీ చాలా బస్టాండ్లు, కాంప్లెక్స్‌ల్లో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం లేదు. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు లేవు. వృద్ధులు, దివ్యాంగులను బస్సుల వద్దకు తీసుకెళ్లేందుకు అవసరమైన వీల్‌ చైర్లు లేవు. ప్లాట్‌ఫామ్‌లు కూడా శిథిలమయ్యాయి. 2020లో కరోనా పేరు చెప్పి జగన్‌ సర్కారు చాలా రూట్లలో బస్సులను రద్దుచేసింది. తరువాత వాటిని పునరుద్ధరించలేదు. రోడ్లు బాగాలేవని చెప్పి మరికొన్ని రూట్లలో సైతం బస్సులు నడపలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్లకు మరమ్మతులు చేపట్టింది. అంతర్రాష్ట్ర, జిల్లా రహదారుల్లో గోతులను పూడ్చింది. ఇంకా చాలా రహదారులు అధ్వానంగానే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించి వసతులు మెరుగుపరిస్తేనే మహిళల ఉచిత బస్సులో ప్రయాణంలో ఇబ్బందులు ఉండవు.

ఏర్పాట్లు చేస్తున్నాం

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. డిపోలు, రూట్లవారీగా బస్సుల వివరాలు ప్రభుత్వానికి అందించాం. ఈ నెలాఖరుకు పూర్తిస్థాయిలో మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. తదనుగుణంగా చర్యలు చేపడతాం.

- జి.వరలక్ష్మి, జిల్లా ప్రజారవాణా అధికారి, విజయనగరం

-----------------

Updated Date - Jul 28 , 2025 | 12:33 AM