మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
ABN, Publish Date - Jun 25 , 2025 | 11:45 PM
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీడీపీవో జి.అనంతలక్ష్మి కోరారు. బుధవారం మండలంలోని పి.కోన వలస ఏపీటీడబ్ల్యూఆర్ బాలుర పాఠశాల వద్ద అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణావ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, వాటి వల్ల కలిగే నష్టాలను వివరించారు.
పాచిపెంట, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీడీపీవో జి.అనంతలక్ష్మి కోరారు. బుధవారం మండలంలోని పి.కోన వలస ఏపీటీడబ్ల్యూఆర్ బాలుర పాఠశాల వద్ద అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణావ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, వాటి వల్ల కలిగే నష్టాలను వివరించారు.
ఫబలిజిపేట, జూన్25(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చెడు వ్యసనాల జోలికి పోకుం డా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బలిజిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ కె.రాజ్యలక్ష్మి కోరారు. బలిజిపేటలో ఉన్నతపాఠశాల, జూనియర్ కాలేజీ, వంతరాం కేజీబీవీ పాఠశాలల్లో అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ ప్రొఫెషన్ ఆఫీసర్ పి. శ్రీధర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు బి.పద్మావతి, ఎస్.సులేఖ, జిల్లా బాలల సంరక్షణ విభగం రావాడ హరికృష్ణ, మహిళా సంరక్షణ అధికారులు సంధ్యారాణి, రేవతి పాల్గొన్నారు.
ఫసాలూరు, జూన్ 25(ఆంధ్రజ్యోతి):మాదకద్రవ్యాల వినియోగం వల్ల దుష్ఫలి తాలు ఎదుర్కొవడమే కాకుండా చట్టపరంగా శిక్షలకు గురికావాల్సి వస్తుందని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ పేర్కొన్నారు. సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నతపాఠశాలలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యా ర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సాలూరు ఐసీడీఎస్ సీడీపీవో, జిల్లా బాలల సంరక్షణ విభాగం కౌన్సిలర్ తవిటినాయుడు, పీటీ నాయుడు పాల్గొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 11:45 PM