ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN, Publish Date - Jul 03 , 2025 | 11:36 PM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, దీనికోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

వృద్ధురాలితో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

- గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మక్కువ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, దీనికోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని దుగ్గేరు, మార్కొండపుట్టి గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గురువారం నిర్వహించారు. మంత్రితో పాటు టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. 2024 ఎన్నికల ముందు వైసీపీ నేతలు తనను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా మండల ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యానని అన్నారు. ‘గత వైసీపీ ప్రభుత్వంలో సైకో జగన్మోహన్‌రెడ్డి వల్ల రాష్ట్రం అధోగతిపాలైంది. గంజాయి, బెట్టింగ్‌, రౌడీషీటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి సైకో జగన్‌ పరామర్శిస్తున్నాడు. జగన్‌ వాహనం కింద నలిగి సింగయ్య మృతి చెందాడు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. సొంత బాబాయిను చంపిన ఘనత జగన్‌కే దక్కుతుంది. మాజీ ఉప ముఖ్యమం త్రి పీడిక రాజన్నదొర ఆయన సొంత గ్రామంలోనే స్కూల్‌ కట్టించలేకపోయారు. రానున్న సంస్థాగత ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు పని చేయాలి. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలి. మక్కువ మండలంలోని 21 పంచాయతీల్లో విజయబావుటా ఎగురవేయాలి. మక్కువలో సుమారు 18 రోడ్లు మంజూరు చేసినా పనులు జరగకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. సాలూరు నియోజకవర్గంలో వంద రోజుల్లో వంద రోడ్లు వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. త్వరలో మండలంలోని రహదారుల నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేస్తాం. దుగ్గేరు ప్రాంత వాసుల చిరకాల స్వప్నం సురాపాడు ప్రాజెక్టును ఖచ్చితంగా నిర్మించి పంట భూములను సస్యశ్యామలం చేస్తాం. దుగ్గేరుకు ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా. మక్కువ మజ్జిగౌరమ్మ గుడి నుంచి సువర్ణముఖి నది వంతెన వరకు నూతన రహదారి, డ్రైనేజీ నిర్మాణానికి టెండర్లు పిలిచాం. ఏపీ రాజధాని అమరావతిగా గర్వంతో ప్రజలు చెప్పుకుంటున్నారు.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాలనాయుడు, నాయకులు దుర్గారావు, వీరభోగం, నంద్యాడ నారాయణ, చిన్నారావు, చొక్కాపు బుచ్చినాయుడు, బొంగు వాసుదేవరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 11:36 PM