'Giri Chaitanyam ‘గిరి చైతన్యం’ కోసం ప్రత్యేక వాహనం
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:30 PM
Special Vehicle for 'Giri Chaitanyam జిల్లాలో గిరిజనులకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు ‘గిరి చైతన్యం’ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని మంగళవారం మక్కువలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు.
పార్వతీపురం, జూన్ 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజనులకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు ‘గిరి చైతన్యం’ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని మంగళవారం మక్కువలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. సికిల్‌సెల్ అనీమియా, దోమతెరల వినియోగం, మలేరియా నివారణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలగురించి ప్రత్యేక వాహనం ద్వారా గిరిపుత్రులకు తెలియజేయనున్నారు. అంతేకాకుండా సంతల్లో నాణ్యమైన వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకోనున్నారు. ఏదేమైనా రాష్ట్రంలోనే తొలిసారిగా మన్యం జిల్లాలో ఈ తరహా కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్ర్కీన్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని అంశాలపై గిరిజనులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.
Updated Date - Jun 17 , 2025 | 11:30 PM