ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Special Teams గంజాయి నియంత్రణకు ప్రత్యేక బృందాలు

ABN, Publish Date - Jul 19 , 2025 | 11:17 PM

Special Teams for Ganja Control గంజాయి నియంత్రణ, ఆ కేసుల్లో ఎన్‌బీడబ్ల్యూ ముద్దాయిలను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాఽథ్‌ జెట్టి ఆదేశించారు. పార్వతీపురంలోని జిల్లా పోలీస్‌ కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరంలో శనివారం ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో అర్ధ వార్షిక సమావేశం నిర్వహించారు.

వన్‌స్టాప్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

పార్వతీపురం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): గంజాయి నియంత్రణ, ఆ కేసుల్లో ఎన్‌బీడబ్ల్యూ ముద్దాయిలను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాఽథ్‌ జెట్టి ఆదేశించారు. పార్వతీపురంలోని జిల్లా పోలీస్‌ కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరంలో శనివారం ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో అర్ధ వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఆరు నెలల్లో జరిగిన నేరాలు , ఛేదించిన కేసులు, పోలీస్‌ యంత్రాంగం చేపట్టిన చర్యలు పెండింగ్‌ కేసులు , చోరీలు, మిస్సింగ్‌, చీటింగ్‌ తదితర కేసుల్లో పురోగతిపై ఎస్పీ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ..‘ శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలి. ఎన్‌కౌంటర్‌, సరెండర్‌లో గాని మావోయిస్టులకు సంబంధించి వివరాలను సేకరించి పోలీస్‌స్టేషన్ల పరిధిలో వారు నేరస్థులో కాదో సరిచూసుకోవాలి. గిరిజనులకు మేలు చేసే ఏ కార్యక్రమమైనా పోలీసులు ముందుండి జరిపించాలి. ప్రజల ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలి.’ అని తెలిపారు. కన్వెక్షన్‌ పెరిగేలా ఏ విధంగా దర్యాప్తు చేపట్టాలో రెండో అదనపు జిల్లా న్యాయాధికారి దామోదర్‌ తెలిపారు. భూ వివాదాలపై ఏ విధంగా ముందుకు సాగాలి, ఇతర శాఖల సమన్వయంతో చేస్తున్న చర్యలను కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ వివరించారు. అనుమతి లేకుండా విద్యా సంస్థల్లో ప్రవేశించడానికి ఎవరికి అధికారం లేదన్నారు. అనంతరం వన్‌స్టాప్‌ సెంటర్‌ పోస్టర్లన ఆవిష్కరించారు.

- జిల్లా పోలీస్‌ కార్యాలయం, డీసీఆర్‌బీ, స్పెషల్‌ బ్రాంచ్‌, సైబర్‌సెల్‌ తదితర విభాగాలను విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాఽథ్‌ జెట్టి శనివారం తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో రికార్డులు పరిశీలించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. అనంతరం అధికారులు, పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏఎస్పీ అంకితా సురాన, డీఎఫ్‌వో ప్రసన్న, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్‌ డీఎస్పీ థామస్‌రెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గ, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:17 PM