PM‑JUGA ‘పీఎం జుగా’కు విశేష స్పందన
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:03 AM
Special Response to PM‑JUGA ప్రధానమంత్రి ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (పీఎం జుగా) కార్యక్రమానికి జిల్లాలో గిరిజనుల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్వతీపురం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (పీఎం జుగా) కార్యక్రమానికి జిల్లాలో గిరిజనుల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ ఈ 30 వరకు పీఎం జుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. ఈ అవగాహన కార్య క్రమాల ద్వారా గిరిజనులకు కావాల్సిన అవసరాలు, ధ్రువపత్రాలు, మౌలిక వసతులను గుర్తించాలి. ఆధార్, రేషన్, ఆయుష్మాన్ భారత్‌కార్డులు, కుల , నివాస ధ్రువీకరణ పత్రాలను వారికి వెంటనే అందించాలి. పీఎం జన్‌మన్ గృహ నిర్మాణాలపై దృష్టి సారించాలి.’ అని తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 12:03 AM