మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:13 AM
నగర పాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కామేశ్, రంగరాజులు డిమాండ్ చేశారు.
విజయనగరం బాబామెట్ట, జూలై 31 (ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కామేశ్, రంగరాజులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరపాలక సంస్థ ఎదుట గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ కార్మికులుగా పనిచేసి 15 మంది పదవీ విరమణ పొందారని, వారి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు, పర్మినెంట్ ఉద్యోగులకు పండుగ సెలవులు అమలు చేయాలన్నారు. కార్మికులకు పనిముట్లు సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 12:14 AM