Soaps above.. Cigarette boxes below పైన సబ్బులు.. కింద సిగరెట్ పెట్టెలు
ABN, Publish Date - May 24 , 2025 | 11:54 PM
Soaps above.. Cigarette boxes below రామభద్రపురంలో శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ పెట్టెలను భారీగా సీజ్ చేశారు. అటుగా వచ్చిన వ్యాన్‌ను అడ్డుకుని బిల్లులను తనిఖీ చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, జీఎస్‌టీ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు చేశారు. సరుకు విలువ రూ.96 లక్షలు ఉండొచ్చునంటున్నారు.
పైన సబ్బులు.. కింద సిగరెట్ పెట్టెలు
గుట్టుగా తరలించే ప్రణాళిక
ఛేదించిన పోలీసులు
రామభద్రపురంలో కలకలం
రామభద్రపురం, మే24(ఆంధ్రజ్యోతి):రామభద్రపురంలో శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ పెట్టెలను భారీగా సీజ్ చేశారు. అటుగా వచ్చిన వ్యాన్‌ను అడ్డుకుని బిల్లులను తనిఖీ చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, జీఎస్‌టీ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు చేశారు. సరుకు విలువ రూ.96 లక్షలు ఉండొచ్చునంటున్నారు. డిష్‌వాస్ సబ్బుల మాటున సిగరెట్ పెట్టెలను రవాణా చేస్తున్నారు. పైన సబ్బులు ఉండడంతో ఎవరికీ అనుమానం రాదని భావించారు. పక్కా సమాచారం అందడంతో మూడు విభాగాల అధికారులు శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి గుట్టు రట్టు చేశారు. వేలాదిగా సిగరెట్ ప్యాకెట్లను గుర్తించారు. వాస్తవంగా ఈ సరుకును గుంటూరు తరలించాలనేది వ్యూహం. తర్వాత ప్రణాళిక మార్చుకుని రామభద్రపురం దించేయాలనుకున్నారు. అంతలోనే దొరికిపోయారు. ఏపీ జీఎస్‌టీ చట్టం సెక్షన్ 67 ప్రకారం కేసు నమోదు చేశారు.
Updated Date - May 24 , 2025 | 11:54 PM