ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Six kilos of rice stolen ఆరేడు కిలోలు హాంఫట్‌!

ABN, Publish Date - Jun 26 , 2025 | 11:56 PM

Six kilos of rice stolen

రాజాం సివిల్‌ సప్లయ్‌ గోదాం

ఆరేడు కిలోలు హాంఫట్‌!

గోదాముల వద్ద రేషన్‌ బియ్యంలో తరుగు

50 కిలోల బస్తాలో 43-44 కిలోలే..

తరచూ ఫిర్యాదు చేస్తున్న డీలర్లు

ఆపై విచారణలు.. బాధ్యుల నుంచి రికవరీలు

ఇన్‌చార్జిగా వెళ్లేందుకు అధికారుల వెనకడుగు

ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం

ఎంఎల్‌ఎస్‌(మండల్‌ లెవెల్‌ స్టాక్‌) పాయింట్‌లలో ఏం జరుగుతోంది... అసలు ఎందుకు నిత్యం తరుగు నమోదవుతోంది... కారకులెవరు.. ఎప్పుటికప్పుడే డీలర్లు ఫిర్యాదులు చేయడంతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద ఎందుకిలా జరుగుతోందో సామాన్యులకు అర్థం కావడం లేదు. మరోవైపు అక్కడ విధులు నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ముందుకు రావడం లేదు. అక్కడ పనిచేస్తే నెల జీతం కంటే రికవరీ అధికంగా కట్టాల్సి ఉంటుందనేది వారి భయం. రాజాంలో దిగువస్థాయి ఉద్యోగి ఒకరు బియ్యం బస్తాలకు కన్నం వేసి పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఆ మధ్య వినిపించాయి. ఈ పరిస్థితి చాలా కేంద్రాల్లో ఉంది.

రాజాం, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి):

ప్రతినెలా తమకు ఇచ్చే బియ్యంలో తరుగు వస్తోందని డీలర్లు తరచూ అధికారులకు ఫిర్యాదు చేయడం.. వారు వచ్చి తనిఖీలు చేసి తరుగును చూపి రికవరీ చేయడం పరిపాటిగా మారింది. అందుకే ఎంఎల్‌ఎస్‌ గోదాము ఇన్‌చార్జిగా రావాలంటే అధికారులు భయపడిపోతున్నారు. పౌర సరఫరాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది కానీ క్షేత్ర స్థాయిలో చాలా లోపాలు వెలుగుచూస్తూ ఉన్నాయి. జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థ అవినీతిమయంగా మారిందన్న విమర్శలున్నాయి. వైసీపీ హయాంలో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకూ అవినీతి విస్తరించిందన్న ఆరోపణలు లేకపోలేదు. అదనపు బాధ్యతలతో వైసీపీ హయాంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిగా పనిచేసిన ఓ మహిళ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలొచ్చాయి. సాక్షాత్తూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత ఆ అవినీతి అధికారిపై విచారణకు ఆదేశించారు. అయితే పైస్థాయిలోనే కాదు కిందిస్థాయిలో కూడా పౌరసరఫరాల శాఖలో అవినీతి మరక ఉంది. ఏ మండలం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు పరిస్థితి తయారైంది.

క్వింటాళ్ల లెక్కన తూకంతో..

రెండు, మూడు మండలాలకు కలిపి ఒక ఎంఎల్‌ఎస్‌ గోదాము ఉంటుంది. కొన్ని గోదాముల నుంచి రేషన్‌ డిపోలకు వస్తున్న బస్తాల్లో 5 నుంచి 7 కిలోల తరుగు వస్తోంది. సాధారణంగా 50 కిలోల బస్తాల రూపంలో బియ్యం సరఫరా చేస్తున్నారు. గన్నీ సంచి బరువు 500 గ్రాములు ఉంటుంది. బియ్యం బరువు 49.500 కిలోలు ఉండాలి. మొత్తం 50 కిలోలు తూకం వేసి ఆపై రేషన్‌ డిపోలకు పంపిస్తుంటారు. అయితే కొన్ని డిపోల నుంచి వచ్చే బరువు కేవలం 43 కిలోలు మాత్రమే ఉంటున్నాయి. దాదాపు అన్ని గోదాముల్లోనూ ఇదే పరిస్థితి అయితే ఈ బియ్యం తరుగు కోతను కవర్‌ చేసేందుకు కొందరు డీలర్లు వినియోగదారులకు తక్కువ బియ్యాన్ని తూస్తున్నారు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. కొన్ని మండలాల్లో డీలర్లు ఫిర్యాదుచేస్తుండడంతో అధికారులు విచారణ చేపడుతున్నారు. గోదాముల వద్ద సిబ్బంది చేతవాటాన్ని గుర్తిస్తున్నారు.

నేరుగా గోదాంల నుంచే..

జిల్లాలో 5.81 లక్షల మంది కార్డుదారులున్నారు. 9,159 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాకు కేటాయిస్తోంది. ఇందులో అంత్యోదయ అన్నయోజన కార్డులు 37,687 ఉన్నాయి. వీరికి 35 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తున్నారు. వీరికి 1319.5 టన్నుల బియ్యం అందుతోంది. 50 కిలోల వద్ద ఏడు కిలోల వరకూ తరుగు వస్తుంటే ఏ స్థాయిలో పక్కదారి పడుతుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇలా తరుగు తీసిన బియ్యాన్ని ఏం చేస్తున్నారనేది మరో ప్రశ్న. ఈ ఏడాది మే 6న విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో రెండు రైస్‌మిల్లులను అక్కడి అధికారులు ఆకస్మికంగా పరిశీలించగా 82.4 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అవి విజయనగరం పౌరసరఫరా శాఖ గోదాముల నుంచి వచ్చిన సరుకుగా నిర్థారించారు. బియ్యం సంచులపై ఉన్న లేబుళ్ల బట్టి ఈ విషయాన్ని తేల్చారు. గోదాముల నుంచి వచ్చిన బస్తాల సీల్‌ విప్పకుండానే తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇదంతా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద నుంచి తరలుతున్న బియ్యంగా తెలుస్తోంది. అంటే ప్రతి నెలా ఏ స్థాయిలో బియ్యం పక్కదారి పడుతుందో ఇట్టే అర్థమవుతోంది.

ఉన్నతస్థాయి అధికారిణి దందా..

వైసీపీ హయాంలో జిల్లాలో పౌరససరఫరా వ్యవస్థ పూర్తిగా పక్కదారి పట్టిందన్న విమర్శలున్నాయి. జిల్లా అధికారి నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకూ వసూళ్లపర్వానికి అలవాటుపడినట్టు ఆరోపణలు వినిపించాయి. ధాన్యం కొనుగోలు సమయంలో కూడా మిల్లర్లతో కుమ్మకయ్యారన్న ఆరోపణలు జిల్లాలో ప్రధానంగా వినిపించేవి. మిల్లర్లకు ప్రతీ 80 కిలోల బస్తా వద్ద 7 కిలోల వరకూ వదులుకుంటేనే అనుమతించేవారు. లేకుంటే రకరకాల కారణాలు చూపుతూ ధాన్యాన్ని తిప్పి పంపేవారు. అయితే అప్పట్లో జిల్లా పౌరసరఫరాల అధికారిణి భరోసాతోనే మిల్లర్లు బరితెగించారని వినికిడి. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాలో పౌరసరఫరాల శాఖతో పాటు వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది

తరుగు అంశం నా దృష్టికి వచ్చింది

సివిల్‌ సప్లయ్‌ గోదాముల నుంచి రేషన్‌ డిపోలకు వెళ్లే బియ్యంలో తరుగు వస్తున్న విషయంపై డీలర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి అక్కడి తరుగు బయటపడకుండా కొందరు డీలర్లు వినియోగదారులకు బియ్యం తగ్గించి ఇస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.

- ఎ.చిరంజీవి, సివిల్‌ సప్లయ్‌ డీటీ, రాజాం

Updated Date - Jun 26 , 2025 | 11:56 PM