AP EAPCET ఏపీ ఈఏపీ సెట్‌లో మెరిశారు
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:37 AM
Shined in AP EAPCET ఏపీ ఈఏపీ సెట్‌లో పాలకొండ విద్యార్థులు మెరిశారు. అత్యుత్తమ ర్యాంకులతో అదరగొట్టారు. పట్టణానికి చెందిన కె.రసజ్ఞ ఇంజనీరింగ్ విభాగంలో 24వ ర్యాంకు, మండలంలో సింగన్న వలసకు చెందిన కె.జస్వంత్ ఫార్మసీ విభాగంలో 27వ ర్యాంకు సాధించారు.
పాలకొండ, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఈఏపీ సెట్‌లో పాలకొండ విద్యార్థులు మెరిశారు. అత్యుత్తమ ర్యాంకులతో అదరగొట్టారు. పట్టణానికి చెందిన కె.రసజ్ఞ ఇంజనీరింగ్ విభాగంలో 24వ ర్యాంకు, మండలంలో సింగన్న వలసకు చెందిన కె.జస్వంత్ ఫార్మసీ విభాగంలో 27వ ర్యాంకు సాధించారు. రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రసజ్ఞ తల్లి రమణమ్మ స్టాఫ్‌నర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి శ్రీనివాసరావు చిరు వ్యాపారిగా ఉన్నారు. ఆ విద్యార్థిని గుడివాడ, విజయవాడలో టెన్త్, ఇంటర్ పూర్తి చేసింది. ఇటీవల విడుదల జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో రసజ్ఞ ఓపెన్ కేటగిరీలో 78వ ర్యాంకు సాధించింది. జేఈఈ మెయిన్స్‌లో 422 ర్యాంకు దక్కించుకుంది. జస్వంత్ తల్లిదండ్రులు రాణి, భాస్కరరావులు వ్యవసాయ రైతులుగా ఉన్నారు. ఆ విద్యార్థి విశాఖలో టెన్త్, ఇంటర్ పూర్తి చేశాడు.
Updated Date - Jun 09 , 2025 | 12:37 AM