ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కులగణనలో తీవ్ర అన్యాయం

ABN, Publish Date - Jun 14 , 2025 | 11:49 PM

రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల జనాభా 25 లక్షలకు పైబడి ఉండగా వైసీపీ హయాంలో ఆ జనసంఖ్యను 4 లక్షలకు, ప్రస్తుత కూటమి ప్ర భుత్వ హయాంలో 7 లక్షలకు తేల్చారని, ఇది చాలా అన్యాయమని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతురావు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరసన తెలుపుతున్న విశ్వబ్రాహ్మణులు

-విశ్వబ్రాహ్మణుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతురావు

బొబ్బిలి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల జనాభా 25 లక్షలకు పైబడి ఉండగా వైసీపీ హయాంలో ఆ జనసంఖ్యను 4 లక్షలకు, ప్రస్తుత కూటమి ప్ర భుత్వ హయాంలో 7 లక్షలకు తేల్చారని, ఇది చాలా అన్యాయమని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతురావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక గాంధీబొమ్మ సెంటరులో గల సంఘ భవనంలో జిల్లా సంఘం అధ్యక్షుడు ముగడ వెంకటరమణ, రాష్ట్ర యూత్‌ అధ్యక్షుడు ములగపాటి బంగార్రాజుల ఆధ్వర్యం లో సంఘ ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా హనుమంతురావు మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విశ్వబ్రాహ్మణుల జనాభాను 19.5 లక్షలున్నట్లు ప్రకటించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్యను ఏడు లక్షలుగా చూపుతున్నారన్నారు. పక్కా లెక్కలను ఆధారాలతో సహా ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.

హామీలు విస్మరించారు..

జీవో నెం.272ని సవరిస్తామని చెప్పిన మాటను విస్మరించారని హనుమంతురావు అన్నారు. స్వర్ణకారుల వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి దానిని ఎంఎంస్‌ఎంఈకి అనుసంధానం చేయడం, అప్సైజర్‌ వ్యవస్థను పూర్తిగా తమ కులానికి వర్తింపజేయడం, మంగళసూత్రాల తయారీ పేటెంట్‌ను విశ్వబ్రాహ్మణు లకు ఇవ్వడం, టింబర్‌ డిపోలను మంజూరు చేయడం, అటవీశాఖ వేధింపుల నుంచి రక్షణ కల్పించడం వంటి వాటిని విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచ వృత్తులు చేసుకునే విశ్వబ్రాహ్మణులందరికీ వేర్వేరుగా కులాలుగా పరిగణించకుండా అందరినీ ఒకే విశ్వబ్రాహ్మణులుగా అధికారికంగా గుర్తించేలా జీవో జారీ చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు శోభన్‌బాబు, సర్వసిద్ధి త్రినాథ రావు, అండ్లూరి గణేశ్‌, నారాయణ, హరిబాబు, కృష్ణ, కర్రి సత్యనారాయణ, జగదీశ్‌, త్రినాథ, రామారావు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:49 PM