బెజ్జిలో పాఠశాలను కొనసాగించాలి
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:56 PM
బెజ్జి గ్రామంలో పాఠశాలను కొనసాగించా లని జనసేన నాయకుడు మిడితాన ప్రసాద్ కోరారు.
పాలకొండ, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): బెజ్జి గ్రామంలో పాఠశాలను కొనసాగించా లని జనసేన నాయకుడు మిడితాన ప్రసాద్ కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ పాఠశాలలో 3, 4, 5 తరగతుల పిల్లలను గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వీరఘట్టం మండలం తలవరం గ్రామ పాఠశాలకు తరలించారన్నారు. అప్పటి నుంచి 1, 2 తరగతుల విద్యార్థులు మాత్రమే బెజ్జి పాఠశాలలో చదువుతున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు పూర్తిగా పాఠ శాలను తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకు ని బెజ్జిలోనే పాఠశాలను కొనసాగించాలని ఆయన ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
Updated Date - Jun 20 , 2025 | 11:56 PM