ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ రెండు రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా కావాలి

ABN, Publish Date - Apr 25 , 2025 | 12:05 AM

భామిని మండలం నేరడి, పాలకొండ మండలం చినమంగళా పురం రీచ్‌ల వద్ద సోమవారం నుంచి ఇసుక సరఫ రా కావాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.

- కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): భామిని మండలం నేరడి, పాలకొండ మండలం చినమంగళా పురం రీచ్‌ల వద్ద సోమవారం నుంచి ఇసుక సరఫ రా కావాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గద ర్శకాలకు అనుగుణంగా ఇసుక సరఫరా జరగాలని స్పష్టం చేశారు. ఇసుకను తరలించేందుకు స్టాక్‌ పాయింట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ముందుగా కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖాధికారులు రీచులను తనిఖీ చేసి నివేదికలు అందించాలన్నారు. ఇసుకను అక్రమంగా తరలించకుండా ఉండేందుకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీస్‌ బందోబస్తు, బారికేడ్లు, చెక్‌పోస్టు, ఆన్‌లైన్‌ వే బిల్లు, రిజిష్టర్లు, రికార్డులు అన్నీ పక్కాగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ శోభిక, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:05 AM