ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సదరం.. మరింత సులభతరం

ABN, Publish Date - May 24 , 2025 | 11:26 PM

దివ్యాంగులు మరింత సులభతరంగా సదరం సర్టిఫికెట్‌ పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

- నెలరోజుల్లోనే సర్టిఫికెట్‌ జారీ

- ‘మనమిత్ర’లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటేచాలు

- యూడీ కార్డుతో అనుసంధానం

- నిరంతరం దరఖాస్తుకు అవకాశం

- ఆనందం వ్యక్తంచేస్తున్న దివ్యాంగులు

గరుగుబిల్లి, మే 24(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులు మరింత సులభతరంగా సదరం సర్టిఫికెట్‌ పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌తో సదరం స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటే చాలు సదరం సర్టిఫికెట్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల్లోపు సదరం సర్టిఫికెట్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సదరం సర్టిఫికెట్‌ పొందేందుకు దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండేది. దరఖాస్తు చేసుకున్నా సర్టిఫికెట్‌ను జారీ చేసేందుకు నెలల తరబడి సమయం పట్టేది. దివ్యాంగుల పరిస్థితిని గమనించిన కూటమి ప్రభుత్వం సదరం దరఖాస్తులను నిరంతరం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూనిక్‌ డిజెబలిటీ ఐడీ కార్డు (యూడీ కార్డు)కు సదరం అనుసంధానం చేసింది. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే సదరం పత్రంతో పాటు వైకల్య శాతం సూచించే కార్డులను అందించనుంది. ప్రస్తుతం సదరం ధ్రువపత్రాలు రాష్ట్రంలోనే చెల్లుబాటు అవుతున్నాయి. అయితే, వీటిని యూడీ ఐడీకి అనుసంధానం చేయడంతో ఇకపై జారీ చేసిన కార్డులు దేశ వ్యాప్తంగా పరిగణలోకి తీసుకోనున్నారు.

మూడు రకాల కార్డుల జారీ..

దివ్యాంగులకు మూడు రకాల యూనిక్‌ కార్డులను జారీ చేయనున్నారు. వైకల్యం 40 శాతం నుంచి 80 శాతం వరకు ఉంటే పసుపు రంగు కార్డు, 80 శాతానికి పైగా ఉంటే నీలి రంగు కార్డు, 40 శాతం కంటే తక్కువ వికలాంగత్వం ఉంటే తెలుపు కార్డును జారీ చేయనున్నారు. 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం, అడ్మిషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ప్రస్తుతం వీరికి సదరం ధ్రువపత్రాలు జారీ అవుతున్నాయి. 2016 చట్ట ప్రకారం యూడీ ఐడీ విధానంలో 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రత్యేక కార్డులను అందించనున్నారు. వీరికి సదుపాయాలు తక్కువగా అందనున్నాయి. 40 శాతం దాటిన వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు, ఇతర సదుపాయాలు వర్తించనున్నాయి. మనమిత్ర గవర్నెన్స్‌లో నిరంతరంగా ధ్రువీకరణ పత్రాల జారీకి అవకాశం కల్పించడంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి..

సదరం స్లాట్‌ పొందేందుకు మీసేవ, గ్రామ సచివాలయాల్లో ఆధార్‌, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలి. పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, వయసు, లింగం, వైవాహికస్థితి, కులం, మతం సహా విద్యార్హత, అలాగే రేషన్‌కార్డు నెంబరు కూడా నమోదు చేయాలి. తరువాత ఆసుపత్రి, తేదీ, సమయం కేటాయిస్తూ ఫోన్‌కు మెసెజ్‌ వస్తుంది. కేటాయించిన ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించే శిబిరాల్లో వైద్యులు పరీక్షించి సదరం సర్టిఫికెట్‌ను అందిస్తారు. సర్టిఫికెట్‌ ఉన్నవారు రెన్యువల్‌ చేసుకునేందుకు కూడా స్లాట్‌ను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - May 24 , 2025 | 11:26 PM