ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధ్యాయుల బదిలీల్లో నిబంధనలు మార్చాలి

ABN, Publish Date - May 29 , 2025 | 11:53 PM

గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీల్లో నిబంధనలు మార్చాల ని యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఆరిక బాస్కరరావు ఐటీడీఏ పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డిని కోరారు.

సీతంపేట రూరల్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీల్లో నిబంధనలు మార్చాల ని యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఆరిక బాస్కరరావు, జిల్లా కార్యదర్శి కె.కృష్ణారావు, పి.కృష్ణారావులు ఐటీడీఏ పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డిని కోరారు. గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్‌, ప్రభుత్వ, మున్సిపాల్‌ ఉపాధ్యాయులకు ఇచ్చిన జీవో నెం.22ను ఆచరణలో పెట్టాలని, హైస్కూల్‌ హెచ్‌ఎంలకు ఐదేళ్లు, మిగిలిన ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్లు తప్పనిస రి చేయాలని, ఉపాధ్యాయులకు బదిలీల్లో సర్వీస్‌ పాయింట్లు కలపాలని, బాలికల ఆశ్రమ పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులను బదిలీ చేయగా మిగిలిన అన్ని క్యాడర్‌ పోస్టులలో పురుష ఉపాధ్యాయులను కూడా బదిలీ చేయాలని పీవోని కోరారు. అంతేకాకుండా ఉపాధ్యాయులతో కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించాల ని, ఆశ్రమ పాఠశాలల్లో ఉన్న ఎస్‌జీటీ ఉపాధ్యాయులను ఆశ్రమ పాఠశాలల్లో బదిలీ చేస్తూ జీపీఎస్‌(టీడబ్ల్యూ) ఉపాధ్యాయులను జీపీఎస్‌ పాఠశాలలకు బదిలీ చేయాలని కోరారు. దీనిపై పీవో సానుకూలంగా స్పందించినట్టు యూటీఎఫ్‌ నాయకులు అరినాన ప్రకాశరావు, సింహాద్రి, జయప్రకాష్‌ తెలిపారు.

Updated Date - May 29 , 2025 | 11:53 PM